Black Pepper Benefits: మిరియాలతో సులువుగా బరువు తగ్గొచ్చు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే
Benefits of Black Pepper: దైనందన జీవితంలో పలు రోగాల బారిన పడటం పరిపాటిగా మారింది. అయితే.. చాలా రోగాలను తగ్గించుకునే దివ్య ఔషధాలు
Benefits of Black Pepper: దైనందన జీవితంలో పలు రోగాల బారిన పడటం పరిపాటిగా మారింది. అయితే.. చాలా రోగాలను తగ్గించుకునే దివ్య ఔషధాలు మన ఇంట్లోనే ఉంటాయన్న సంగతి తెలుసు. కానీ ఎవరూ కూడా వాటి ఉపయోగాల గురించి తెలుసుకోరు. అలాంటి దివ్య ఔషధాల్లో సుగంధ ద్రవ్యాలు మిరియాలు కూడా ఒకటి. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఉపయోగిస్తారు. మిరియాలు వంటలకు చక్కని రుచి తీసుకువస్తాయి. కొన్నిచోట్ల కారం పొడికి బదులుగా మిరియాలను కూడా ఉపయోగిస్తుంటారు.
అయితే మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని.. వాటితో పలు రోగాలను, సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మిరియాలతో బరువు తగ్గడం నుంచి జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మిరియాలను రోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
➼ మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలున్నాయి. నాలుగైదు మిరియాలను తీసుకుని.. వాటిని తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గవచ్చని సూచిస్తున్నారు. ➼ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. ➼ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసి ఉదయాన్నే తాగితే.. శరీరంలోని మలినాలతోపాటు.. కొవ్వు కరిగుతుంది. దీంతో అధిక బరువును నియంత్రించవచ్చు. ➼ మిరియాల నీటిలో.. అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి వేసి టీ లాగా తాగితే అధిక బరువు త్వరగా తగ్గవచ్చు. ➼ వీటితోపాటు ఆహారంలో మిరియాలను ఉపయోగించినా కొవ్వు తగ్గుతుందని పేర్కొంటున్నారు.
Also Read: