Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: మీ చిట్టి గుండె సంరక్షణ కోసం ఈ ఒక్క డ్రింక్ తాగింతే చాలు.. ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

ప్రస్తుతం ఉన్న వేసవికాలంలో డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు ఎదురవడం అనేది సర్వసాధారణ విషయమే. అయితే ఈ సమస్యల బారిన పడకుండా, లేదా వీటిని అధిగమించేందుకు పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొబ్బరి నీళ్లు లేదా..

Health Care: మీ చిట్టి గుండె సంరక్షణ కోసం ఈ ఒక్క డ్రింక్ తాగింతే చాలు.. ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
Barley Water For Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 12, 2023 | 6:10 AM

శకాలనుగుణంగా, వయసు పైబడడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వేదిస్తుంటాయి. అలాగే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూసిస్తాయి. ఇక ప్రస్తుతం ఉన్న వేసవికాలంలో డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు ఎదురవడం అనేది సర్వసాధారణ విషయమే. అయితే ఈ సమస్యల బారిన పడకుండా, లేదా వీటిని అధిగమించేందుకు పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొబ్బరి నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా సగ్గుబియ్యంతో చేసిన జావని తప్పనిసరిగా తాగాలని సూచిస్తున్నారు. ఇక ఈ బార్లీ గింజల గురించి చెప్పాలంటే వీటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బార్లీ గింజలలో ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉండడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. అందుకే పూర్వకాలంలో జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా బార్లీ నీళ్లు కూడా తాగించేవాళ్లు. ఆ కారణంగానే కడుపుతో ఉన్నవారికి కూడా పోషణ కోసం బార్లీ నీళ్లను తాగిపిస్తారు.

ఇక ఈ బార్లీ నీళ్ల కోసం బార్లీ గింజలను నీటిలో 15 నిముషాల పాటు మరిగిస్తే చాలు. అలా చేయడం వల్ల ఆ గింజలలోని పోషకాలు నీటిలో చేరతాయి. ఆపై నీటిని వడకట్టి తాగాలి. ఇక ఈ నీటిని నేరుగా తాగవచ్చు. ఒక వేళ మీకు కొంచెం రుచి కావాలంటే ఈ నీటిలో నిమ్మ‌ర‌సం, ఒక టీ స్పూన్ తేనెను క‌లుపుకోవచ్చు. ఈ నీళ్లను ప్రతిరోజూ ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఈ బార్లీ నీళ్లతో ఏయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

జీర్ణ సమస్యలకు చెక్:వేసవి కాలంలో సాధారణంగానే ఎదురయ్యే అజీర్తి సమస్యలకు బార్లీ నీళ్లతో స్వస్తి పలకవచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాలను పొందగలుగుతారు.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం: బార్లీ నీళ్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే హృదయ సంబంధిత వ్యాధులను నిరోధిస్తాయి. ఇంకా బార్లీ నీళ్లతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునేవారికి కూడా బార్లీ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో ఉండే పోషకాలు ఆకలి కోరికను నియంత్రించడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయి. తద్వారా ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇక బరువు తగ్గాలనుకునేవారు రోజులో రెండు పూటలా తాగితే చాలు.

మహిళలకు మంచిది: మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్యలో మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ కూడా ఒకటి. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే రోజూ బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇంకా పీరియడ్ సమయంలో ఎదురయ్యే నొప్పిని కూడా నియంత్రించడంలో బార్లీ నీళ్లు ఉపయోగకరం.

గర్భిణీలు: గర్భిణీలు రోజూ బార్లీనీళ్లు తాగితే వారి ఆరోగ్యానికి మరీ మంచిది. కడుపుతో ఉన్నప్పుడు బార్లీ నీళ్లను తాగితే కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. ప్రతిరోజూ రెండు పూటలా బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి.

పిల్లల ఆరోగ్యం: బార్లీ నీళ్లు పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండల కారణంగా పిల్లలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వారికి కావలసిన పోషకాలను కూడా బార్లీ నీళ్లు అందించగలవు.

డయాబెటిక్స్: మధుమేహులకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి బార్లీ నీళ్లు ఉపయోగపడతాయి. ఇంకా ఇన్సులిన్‌ కూడా అదుపులోనే ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి