Tips For Reduce Sinus Problem: వర్షాకాలం సైనస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..
Tips For Reduce Sinus Problem: వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు సైనస్ సమస్యతో బాధపడేవారికి నరకం కనిపిస్తుంది. బద్దలయ్యే తలనొప్పితో తీవ్ర సమస్యను ఎదుర్కొంటారు. ముఖ్యంగా సైనస్‌తో బాధడేవారు.. తలనొప్పి, ముఖం నొప్పి, ముక్కులో...
Tips For Reduce Sinus Problem: వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు సైనస్ సమస్యతో బాధపడేవారికి నరకం కనిపిస్తుంది. బద్దలయ్యే తలనొప్పితో తీవ్ర సమస్యను ఎదుర్కొంటారు. ముఖ్యంగా సైనస్‌తో బాధడేవారు.. తలనొప్పి, ముఖం నొప్పి, ముక్కులో నొప్పిగా ఉండడం, చెవులు, దంతాల నొప్పులు, జ్వరం, ముఖం వాయడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని నేచురల్ టిప్స్ ద్వారా సైనస్ సమస్యకు చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? సైనస్ సమస్యను తరిమికొట్టే కొన్ని టిప్స్ పై ఓ లుక్కేయండి..
* ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకుంటే సైనస్ నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాకుండా యాపిల్ సైడర్ వెనిగర్‌ను టీ రూపంలో తీసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది.
* అల్లంతో తయారు చేసిన కషాయం కూడా సైనస్ సమస్యకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనెలను కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* సైనస్ సమస్యతో బాధపడే వారు వర్షాకాలంలో వేడి వేడీ సూప్‌లు తీసుకోవాలి దీనివల్ల ముక్కు దిబ్బడ తగ్గి, శ్వాస సరిగ్గా ఆడుతుంది. దీంతో సైనస్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* సైనస్ సమస్య ఉన్న వారు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం వల్ల సైనస్ లక్షణాలు పెద్దగా బాధించవు. ముఖ్యంగా గోరు వెచ్చని నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే.. నాసికా మార్గంలో అడ్డంకులు తొలగిపోయి.. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
* సైనస్‌తో బాధపడే వారు.. నీటిలో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి అనంతరం ఆ నీటిని ఆవిరిగా పట్టుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు ఇలా చేస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Food Habits: జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా.. మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త!
Monkeypox: యూకేలో బయటపడిన మరో వైరస్.. మంకీపాక్స్ లక్షణాలతో ఇద్దరు.. జాగ్రత్త అవసరం అంటున్న నిపుణులు