AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Habits: జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా.. మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త!

Food Habits: సాధారణంగా మనం మన శారీరక పోషణ కోసమే ఆహరం అనుకుంటాం. ఎంత బాగా తింటే అంత శరీరానికి మంచిది అని నమ్ముతాం. తీసుకునే ఆహారం కూడా ఆ విధంగానే ఉండేలా చూసుకుంటాం.

Food Habits: జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా.. మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త!
Food Habits
KVD Varma
|

Updated on: Jun 14, 2021 | 3:58 PM

Share

Food Habits: సాధారణంగా మనం మన శారీరక పోషణ కోసమే ఆహరం అనుకుంటాం. ఎంత బాగా తింటే అంత శరీరానికి మంచిది అని నమ్ముతాం. తీసుకునే ఆహారం కూడా ఆ విధంగానే ఉండేలా చూసుకుంటాం. ఇక జిహ్వాచాపల్యం ఉన్నవారైతే తిండి ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా.. ఏది దొరకితే అది అన్నట్టు తినేస్తారు. అలా తిండి విషయంలో కంట్రోల్ లేనివారిని చూసి అందరూ ఒళ్ళు వచేస్తుంది జాగ్రత్త.. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జగ్రత్త.. ఇలా చెబుతారు. కానీ,

మనం తినేది మన శారీరకమే కాకుండా మన మానసిక స్థితిపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఆరోగ్యకరమైన ఆహారం పాటించని 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆందోళన, నిరాశ అదేవిధంగా, ఒత్తిడికి గురవుతారు. న్యూయార్క్‌లోని బింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 30 ఏళ్లు పైబడిన 322 మంది మహిళలు, 322 మంది పురుషులను అధ్యయనం చేశారు. వీరందరి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, మానసిక స్థితి కూడా వారి అధ్యయనంలో ఉన్నాయి. ఎక్కువ గింజలు, చేపలు, పచ్చి ఆకు కూరలు తినే పురుషులు లేదా మహిళలు ఇతర వ్యక్తుల కంటే సంతోషంగా ఉన్నారని వారు కనుగొన్నారు.

దీనికి విరుద్ధంగా, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులు, అల్పాహారం తినని వ్యక్తులు మూడ్ స్వింగ్స్ కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. బంగాళాదుంపలు, చిప్స్, స్వీట్లు లేదా వైట్ బ్రెడ్ వంటి అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. వీటిని తినడం ఎక్కువ అలవాటు ఉన్న స్త్రీలకు పురుషులకన్నా ఎక్కువ ప్రతికూల దుష్ప్రభావాలు ఉంటాయని ఈ పరిశోధన ద్వారా వారు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పురుషుల కంటే మహిళల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వారంటున్నారు. ఆహారం విషయంలో పురుషుల కంటె మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు.

ఈ పాల్గొనేవారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వ్యాయామానికి ప్రత్యేక పాత్ర ఉందని పరిశోధకులు నిరూపించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే స్త్రీలు లేదా పురుషులు, వ్యాయామం చేయని వారి కంటే వారి మానసిక స్థితి మంచిది.

Also Read: Desi Ghee Benefits : ప్రకాశవంతమైన ముఖం కోసం దేశీ నెయ్యి..! చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం..?

world blood donor day -2021 : కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చా..? చేస్తే ఏం జరుగుతుంది..