Almonds Benefits: ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే మంచిదా ? లేదా పొడి బాదం తినడం మంచిదా ? తెలుసుకుందాం..
Soaked Almonds vs Raw Almonds: బాదం పప్పు... ఎన్నో విలువైన పోషకాలు కలిసిన ఆహారం. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
Soaked Almonds vs Raw Almonds: బాదం పప్పు… ఎన్నో విలువైన పోషకాలు కలిసిన ఆహారం. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తింటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటుంటారు. అంతేకాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాదం పప్పు ఎంతో సహాయపడుతుందని అంటుంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదం పప్పును తినడం వలన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి అంటారు. అయితే నానబెట్టిన బాదం పప్పు తినడం మంచిదా ? పొడి బాదం తినడం మంచిదా ? అనేది తెలుసుకుందాం.
బాదం పప్పు పైన ఉండే పొట్టులో టానిన్ ఉంటుంది. ఇది పోషక శోషణను నిరోదిస్తుంది. బాదం నానబెట్టినప్పుడు ఆ తొక్కను తీసి తినడం మంచిది. బాదం పప్పును సుమారు ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టడం మంచిది. బాదం పప్పులో విటమిన్ ఈ , డైటరీ ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే మాంగనీస్ ఎముకలు బలంగా ఉండేందుకు సహయపడతాయి. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇవి చాలా మంచివి. అలాగే కండరాలు, నరాల పనితీరు మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. నానబెట్టిన బాదం కొవ్వును కరిగించడానికి సహాయపడే లిపేస్ ఎంజైమ్ విడుదల చేస్తుంది. ఇందులో ఉండే.. మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆకలిని నియంత్రిస్తాయి. ఈ కారణంగా అతిగా తినడం తగ్గిస్తాము. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.