Parenting Tips: పిల్లలకు ఇలాంటి ఫుడ్స్ అస్సలు పెట్టకండి.. మెదడు మొద్దు బారిపోతుంది!!
ఎదిగే పిల్లలకు కొన్నిరకాల ఫుడ్స్ ఇస్తే.. వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, బేకరీ ఫుడ్ ఇస్తే.. చిన్న వయసులోనే వారు షుగర్ కి, రక్త పోటు వంటి సమస్యలకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ రకమైన ఫుడ్స్ లలో ఇందులో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. దీంతో ఇలాంటి ఫుడ్స్ తీసుకునే వారిలో మెదడు మొద్దు బారిపోవడమే కాకుండా ఏకాగ్రత నశించడం..

ఎదిగే పిల్లలకు కొన్నిరకాల ఫుడ్స్ ఇస్తే.. వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, బేకరీ ఫుడ్ ఇస్తే.. చిన్న వయసులోనే వారు షుగర్ కి, రక్త పోటు వంటి సమస్యలకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ రకమైన ఫుడ్స్ లలో ఇందులో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. దీంతో ఇలాంటి ఫుడ్స్ తీసుకునే వారిలో మెదడు మొద్దు బారిపోవడమే కాకుండా ఏకాగ్రత నశించడం, డిప్రెషన్ కి గురి కావడం, మెమెరీ లాస్ అవ్వడం వంటి వాటికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ లాంటి ఫుడ్స్ ని పిల్లలకు ఇవ్వడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వయసులోనే షుగర్ వస్తుంది:
పిల్లలు కూడా స్వీట్స్ లాంటి ఫుడ్సే ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు. కానీ స్వీట్స్, కేక్స్, బేబీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీంతో వారికి చిన్న ఏజ్ లోనే మధుమేహం వస్తుంది. ఇలాంటి ఫుడ్స్ ని తినడం వల్ల ఆకలిపై ప్రభావితం చూపిస్తుంది.
కలర్ ఫుల్ ఫుడ్ ఇవ్వకండి:
చిన్న పిల్లలు కలర్ ఫుల్ ఫుడ్ తినడానికే మక్కువ చూపిస్తారు. కానీ అలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ని పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకుంటే వాటిలో రసాయనాలు అనేవి ఎక్కువగా కలుపుతూ ఉంటారు. కాబట్టి అవి వారి మెదడుపై ప్రభావితం చేసే అవకాశలు ఉన్నాయి. కాస్త కష్టమైనా ఇంట్లోనే నీట్ గా తయారు చేసి పిల్లలకు ఇవ్వడం మంచిది కానీ.. బయట ఫుడ్ ని అస్సలు ఇవ్వకండి.
ఎక్కువగా చాక్లెట్స్ ఇవ్వకండి:
పిల్లలకు చాక్లెట్స్ అన్నా.. చాక్లెట్స్ ఐటెమ్స్ అన్నా ప్రాణం. ఎక్కడ చూసినా కొని ఇవ్వమని అడుగుతూంటారు. కానీ చాక్లెట్స్ లో కూడా కెఫీన్ ఉంటుంది. కాబట్టి చాక్లెట్స్ ను పిల్లలకు ఇవ్వకండి. ఎక్కువ మోతాదులో కెఫీన్ ఇస్తే.. వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల పిల్లల్లో నిద్రలేమి,భయం, తలనొప్పి, కడుపులో నొప్పి, హైపర్ యాక్టీవ్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి వారి ఎదుగుదలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబ్టటి వీటిని పిల్లలకు దూరంగా ఉంచితే చాలా బెటర్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.