Health Benefits: ఎత్తు ఎక్కువగా ఉండే వారిలో ఆ ముప్పు తక్కువేనట.. అధ్యయనంలో కీలక విషయాలు

Health Benefits: చాలా మంది ఎత్తు లేనని, పొట్టిగా ఉన్నానని బాధపడుతుంటారు. ఎత్తు పెరిగేందుకు ఏవేవే ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ఎక్కువ ఎత్తు ఉంటే కొన్ని లాభాలు,

Health Benefits: ఎత్తు ఎక్కువగా ఉండే వారిలో ఆ ముప్పు తక్కువేనట.. అధ్యయనంలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2022 | 7:39 AM

Health Benefits: చాలా మంది ఎత్తు లేనని, పొట్టిగా ఉన్నానని బాధపడుతుంటారు. ఎత్తు పెరిగేందుకు ఏవేవే ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ఎక్కువ ఎత్తు ఉంటే కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విషయాలు తాజా సర్వేలో వెల్లడైంది. న‌రాలు దెబ్బ‌తిన‌డం, చ‌ర్మ‌, ఎముక‌ల ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌య్యే ముప్పు వీరిలో అధిక‌ంగా ఉండగా, ఎత్తు ఎక్కువగా ఉన్నవారిలో హృద్రోగ ముప్పు, అధిక రక్తపోటు, అధిక కొవ్వు వంటి రిస్క్‌లు తక్కువగా ఉంటాయని నిపుణులు అధ్యయనం ద్వారా తేల్చారు. ఎత్తుకు, వ్యాధుల‌కు మ‌ధ్య ఉండే సంబంధంపై ప్ర‌పంచంలోనే అతిపెద్ద అధ్య‌య‌నం వివ‌రాలు జ‌ర్న‌ల్ పీఎల్ఓఎస్ జెనెటిక్స్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

వేలాది మందిపై అధ్యయనం:

ఎత్తు ఎక్కువగా ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయన్నదానిపై పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. వేలాది మంది క్లినిక‌ల్ రికార్డుల‌తో కూడిన జెనెటిక్ డేటా క‌లిగిన వీఏ మిలియ‌న్ వెట‌ర‌న్ ప్రోగ్రాం గ‌ణాంకాల‌ను అధ్య‌య‌న బృందం ఉప‌యోగించుకుంది. అధ్య‌య‌నంలో భాగంగా 3,23,793 మంది రికార్డుల‌ను ప‌రిశోధ‌కులు ప‌రిశీలించి ఈ వివ‌రాలు తేల్చారు. ఎత్తు ప‌లు వైద్య ల‌క్ష‌ణాల‌తో ముడిప‌డిఉంద‌ని నిపుణులు గుర్తించారు. క్లినికల్ లక్షణాలతో కొలిచిన ఎత్తు, జన్యుపరంగా అంచనా వేసిన ఎత్తు అనుబంధాలను ప‌రిశోధ‌కులు పరిశీలించారు. ఎత్తు ఎక్కువగా ఉన్న వారిలో నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి