Octopus Facts: ఈ జీవికి 3 గుండెలు.. 9 మెదడులు.. దీని ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు..!

Octopus Facts: సాధారణంగా మనిషికి గుండె, దానిలో నాలుగు గదులు. అన్ని జీవులకు కూడా ఇలానే ఉంటాయనుకుంటే పొరపాటే. ఒకటికన్న ఎక్కువ గుండెలున్న..

Octopus Facts: ఈ జీవికి 3 గుండెలు.. 9 మెదడులు.. దీని ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 07, 2022 | 5:50 AM

Octopus Facts: సాధారణంగా మనిషికి గుండె, దానిలో నాలుగు గదులు. అన్ని జీవులకు కూడా ఇలానే ఉంటాయనుకుంటే పొరపాటే. ఒకటికన్న ఎక్కువ గుండెలున్న జీవులు కూడా ఉన్నాయి. ఇక సెఫలోపొడా కుటుంబానికి చెందిన జీవుల్లో అక్టోపస్‌ ఒకటి. దీనికి మూడు గుండెలు ఉంటాయి. మూడు గుండెలు ఉండటం ఏంటని అనుకుంటున్నా..? మేము చెప్పేది నిజమే. దీనికి నీరం రంగు రక్తం ఉంటుంది. దీనిలో రెండు గుండెలు రక్తాన్ని మొప్పల్లోకి పంప్‌ చేస్తే, మరొకటి మాత్రం రక్తాన్ని శరీరం అంతా వెళ్లేలా చేస్తుంది.

రూపానికి వింతగా కనిపించే ఈ జీవి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జీవిలో ప్రత్యేక లక్షణాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ జీవి గురించి ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జీవిలో మీరు చూసే చేతులు దాని కాళ్ళు కావు. చాలా మంది దాని కాళ్ళు అని అనుకుంటారు. అలాగే ఇది ప్రతి చేతిలో మెదడును కలిగి ఉంటుంది. ఈ జీవికి 9 మెదడులను కలిగి ఉంటుంది.

ఇది ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ జీవికి చేతులు ఎంతో ఉపయోగం..

దీనికున్న చేతులు ఈ జీవికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ జీవి నుండి అయినా రక్షించడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా సముద్రంలో నివసిస్తుంది. ఆక్టోపస్ జీవిత కాలం పెద్దగా ఉండదు. దానికి సంబంధించిన జాతులు చాలా వరకు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వాటి జీవితకాలం 6 నెలలు.

(నోట్‌: ఇందులోని అంశాలు సైన్స్‌ నిపుణులు, ఇతర వెబ్‌సైట్ల ఆధారంగా అందించడం జరుగుతుంది.)

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?