Diabetes: భారతదేశంలో 150 శాతం పెరిగిన డయాబెటిస్‌ కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన ICMR

Diabetes: ప్రస్తుతం కాలంలో వివిధ వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల..

Diabetes: భారతదేశంలో 150 శాతం పెరిగిన డయాబెటిస్‌ కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన ICMR
Follow us
Subhash Goud

|

Updated on: Jun 08, 2022 | 5:44 AM

Diabetes: ప్రస్తుతం కాలంలో వివిధ వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక భారత్‌లో డయాబెటిస్‌ రోగుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రోజురోజుకు మధుమేహం కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుండటంతో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మధుమేహ రోగులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచంలోనే వయోజనుల్లో మధుమేహ రోగులున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహం రోగులు 150 శాతం పెరుగుతున్నారని ఐసీఎంఆర్‌ తెలిపింది. టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రణలో జీవన శైలి నిర్వహణ ఎంతో కీలకమని తెలిపింది. మధుమేహం ఉన్నవాళ్లు ఆహార నియమాలు పాటిస్తూప్రతి రోజు వ్యాయమం చేయడం ఎంతో ముఖ్యమన్నారు. బీపీ, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రణలో ఉంచుకుంటూ శరీర ఎదుగుదలకు సరైన పోషకాహారం తీసుకోవాలని తన మార్గదర్శకాల్లో పేర్కొంది ఐసీఎంఆర్‌.

  1. మనం తీసుకునే కార్పోహైడ్రేట్లలో 70 శాతం కాంప్లెక్స్‌ కార్పొహైడ్రేట్స్‌ ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రతి రోజు వ్యాయమాలు చేయడం మర్చిపోవద్దని, దీని వ్లల శరీరం చురుకుగా ఉండడమే కాకుండా షుగర్స్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయని వెల్లడించింది.
  2. డయాబెటిస్‌ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతున్నారని, పైగా, మధుమేహంతో కూడిన రక్తపోటు ఉన్నవారిలో 50 శాతం మందికి వారి రక్తపోటు నియంత్రణలో ఉండదని ఐసీఎంఆర్‌ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది.
  3. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ మధ్య వ్యత్యాసం ఉందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1 మధుమేహం జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు. ఇందులో చిన్న వయసులోనే మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. టైప్-2 మధుమేహం రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం.
  4. ఆకు కూరలు: డయాబెటిస్‌ ఉన్నవారు మధ్యాహ్న భోజనం సమయంలో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలీ, గోరింటాకు, తోరాయి, చేదుకాయ వంటివి తినవచ్చు. వీటిలో తక్కువ కెలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండె, కంటికి ఎంతోగానో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్‌-సి ఉంటుంది. ఇది టైప్‌-2 డయాబెటిస్‌ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. గుడ్డు, చేపలు: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆహారంలో గుడ్డును చేర్చడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజు ఒక గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు. రోజు గుడ్డు తినడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ వారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
  7. ఇక చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఎసెన్షియల్‌ ఆయిల్‌ పుష్కలంగా ఉంటుంది. చికెన్‌, గుడ్లు, చేపలు, ప్రోటీన్‌లకు మంచి మూలం. ఇందులో కార్పోహైడ్రేట్లు కలిగి ఉంటాయి.
  8. బెర్రీలు వంటి తాజా పండ్లు: బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్‌గా పరిగణించబడతాయి. వాటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్, బెర్రీలు,పియర్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఫైబర్‌ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..