Health: భారత్‌లో స్ట్రోక్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.. ముందస్తు జాగ్రత్తలతో మరణాలకు చెక్..
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా స్ట్రోక్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇండియన్ స్ట్రోక్ అఫిలియేషన్ ప్రకారం భారత్‌లో స్ట్రోక్ బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు..
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా స్ట్రోక్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇండియన్ స్ట్రోక్ అఫిలియేషన్ ప్రకారం భారత్‌లో స్ట్రోక్ బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 1.8 మిలియన్ల మంది వ్యక్తులు స్ట్రోక్ తాలుకు దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. అయితే వీరిలో చాలా మంది ముందస్తు చికిత్స తీసుకోవడం వల్ల మరణాలు తగ్గుతున్నాయి. మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడడం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి.
ఈ స్ట్రోక్‌కు ఒత్తిడి కూడా కారణంగా నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడిలాంటివి ఒత్తిడిని కలిగిస్తాయి. ఇక కరోనా కారణంగా కూడా చాలా మందిలో ఒత్తిడి పెరిగింది. ఇలా నిరంతరంగా కొనసాగితే ఒత్తిడి కారణంగా చాలా మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. మెజారిటీ స్ట్రోక్‌లు మెదడులోని ఇన్‌ఫ్రాక్ట్‌ల వల్ల సంభవిస్తాయి. 10 శాతం కంటే ఎక్కువ మందిలో రక్తస్రావం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి. స్ట్రోక్‌కు కారణమయ్యే ప్రధాన కారణాల్లో ధూమపానం, మద్యపానం ప్రధానంగా చెప్పొచ్చు.
అలాగే మధుమేహం, రక్తపోటు, డైస్లిపిడెమియో, గుండె జబ్బులు, గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి. స్ట్రోక్ సమస్యను కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కంటిలో మార్పులు, ముఖం ఒకవైపు వంగడం, ఒక చేయి బలహీనంగా మారడం వంటివి లక్షణాల ద్వారా స్ట్రోక్‌ను ముందస్తుగానే గుర్తించవచ్చు. అలాగే ముఖం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మైకం రావడం, ఎలాంటి కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి రావడం వంటివి స్ట్రోక్ లక్షణాలుగా చెప్పొచ్చు.
స్ట్రోక్‌కి ఇలా చెక్ పెట్టొచ్చు..
మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్లే స్ట్రోక్ వస్తుందనే విషయం తెలిసిందే. అందుకే మెడిటేషన్, యోగా వంటి శ్వాస సంబంధిత వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. దీంతో మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. మానసిక ఆనందాన్ని పెంపొందించేందుకు మార్గాలను వెతుక్కోవాలి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మంచి సంగీతం వినడం, వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి. ఇక స్ట్రోక్ తాలుకూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సూచనలు తీసుకోవడం ద్వారా వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నివారించవచ్చు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..