AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Throat Infection: వేసవిలో గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఆ పొరబాట్లు సరిదిద్దుకుంటే సరి..

వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడల్లా దగ్గు, జ్వరం, కడుపునొప్పి, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి చాలా సాధారణం. కానీ మారుతున్న వాతావరణం వల్ల ప్రతిసారి పలకరించే సమస్యల్లో అతిపెద్ద సమస్య గొంతు ఇన్ఫెక్షన్. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యల బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో గొంతు ఇన్ఫెక్షన్ బారీన పడకుండా జాగ్రత్త ఉండటం చాలా ముఖ్యం. గొంతు ఇన్ఫెక్షన్ సమస్యకు..

Throat Infection: వేసవిలో గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఆ పొరబాట్లు సరిదిద్దుకుంటే సరి..
Throat Infection
Srilakshmi C
|

Updated on: Apr 15, 2024 | 12:22 PM

Share

వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడల్లా దగ్గు, జ్వరం, కడుపునొప్పి, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి చాలా సాధారణం. కానీ మారుతున్న వాతావరణం వల్ల ప్రతిసారి పలకరించే సమస్యల్లో అతిపెద్ద సమస్య గొంతు ఇన్ఫెక్షన్. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యల బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో గొంతు ఇన్ఫెక్షన్ బారీన పడకుండా జాగ్రత్త ఉండటం చాలా ముఖ్యం. గొంతు ఇన్ఫెక్షన్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. వేసవి కాలంలో గొంతులో టాన్సిల్స్ వంటి సమస్యలు వస్తాయని, దీని వల్ల నీరు తాగడానికి, మింగడానికి ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతుంటే, ఈ కింది హోమ్‌ రెమెడీలు సహాయం పొందవచ్చు. అవేంటంటే..

వెంటనే ఏసీలో కూర్చోకూడదు

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ, కూలర్‌ వేసుకుని కూర్చోవద్దు. ఇది వేడి, చలికి కారణమవుతుంది. దీని ప్రభావం గొంతుపై పడవచ్చు. మీరు ఏసీలో కూర్చోవాలనుకుంటే.. దాని ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉండేలా చూసుకోవాలి.

స్నానం చేయడం హానికరం

మనలో చాలా మంది బయట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత, నేరుగా స్నానం చేయడానికి లేదా ముఖం కడగడం వంటివి చేస్తుంటారు. ఇది కూడా జలుబు, గొంతు నొప్పికి కారణం అవుతుంది. అందువల్ల, కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాత్రమే నీళ్లను ముట్టుకోవడం మంచిది. ప

ఇవి కూడా చదవండి

చల్లని పానీయాలు తీసుకోవడం మానుకోవాలి

వేసవి కాలంలో ఐస్ క్రీం, శీతల పానీయాలు తాగడం చాలా సరదాగా ఉంటుంది. కానీ అవి గొంతు నొప్పికి దారి తీస్తుంటాయి. శీతల పానీయాలు కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి పిల్లలు చల్లటి పదార్థాలు తినకుండా నివారించాలి.

ఆవిరి పట్టుకోవాలి

గొంతు నొప్పి, శ్లేష్మం వంటి సమస్యల నుంచి ఉపశమనానికి ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్టీమర్‌తో ఆవిరి పట్టేటప్పుడు దుప్పటి లేదా టవల్‌తో ముఖాన్ని కప్పుకోవాలి. కనీసం 5 నుంచి 7 నిమిషాల వరకు ఆవిరి పట్టాలి.

కషాయం కూడా ప్రయోజనకరమే!

ఒక లీటరు నీటిలో 1 టీస్పూన్ తులసి, ఎండుమిర్చి, ఎండు అల్లం, దాల్చిన చెక్కలను వేసి సన్నని మంటలపై బాగా వేడి చేయాలి. ఇందులోని ఔషధ గుణాలన్నీ నీళ్లలోకి వచ్చి కషాయం తయారు అవుతుంది. కషాయం తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..