Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: గుక్కపెట్టి ఏడిచే సమయంలో.. చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా.? దీనికి కారణమేంటో తెలుసా..

Breath Holding Spells: పిల్లల్ని పెంచడం కూడా పెద్ద ఆర్ట్‌ అని చెబుతుంటారు. చిన్నారులు కొంత వయసుకు వచ్చే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రతీ పేరెంట్‌ కూడా ఇందుకోసమే ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో..

Parenting Tips: గుక్కపెట్టి ఏడిచే సమయంలో.. చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా.? దీనికి కారణమేంటో తెలుసా..
Breath Holding Spells
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2021 | 1:51 PM

Parenting Tips: పిల్లల్ని పెంచడం కూడా పెద్ద ఆర్ట్‌ అని చెబుతుంటారు. చిన్నారులు కొంత వయసుకు వచ్చే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రతీ పేరెంట్‌ కూడా ఇందుకోసమే ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్నారుల్లో కనిపించే ఊహించని పరిణామాలు పెద్దలను షాకింగ్‌కు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారులు ఏడిచే సమయంలో వారిలో కనిపించే మార్పులు భయపెట్టిస్తాయి. పిల్లలు గుక్కపెట్టి ఏడిచే సమయంలో జరిగే మార్పు పెరేంట్స్‌ను తీవ్రంగా భయానికి గురి చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పేరెంట్స్‌కు జీవితంలో మరిచిపోలేని పీడ కలగా మారుతుంది. కొంత మంది చిన్నారులు గుక్కపెట్టి ఏడిచే సమయంలో శరీరం నీలం రంగులోకి మారుతుంది. దీనినే బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ అంటారు. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

అసలేంటీ బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌, లక్షణాలు ఏంటి.?

ఈ బ్రీత్‌ హోల్డింగ్ స్పెల్స్‌ సమస్య 6 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. చిన్నారుల చేతుల్లో వస్తువులను ఉన్నట్లుండి లాక్కోవడం లేదా వారు చేస్తోన్న పనిని అడ్డుకోవడం వల్ల సడెన్‌గా ఏడుపు మొదలు పెడతారు. ఇలా క్రమేణా పెరిగే ఏడుపు వారి శ్వాస ప్రక్రియ ఆగిపోయేంత వరకు దారి తీస్తుంది. దీంతో ముఖం నీలి రంగులోకి మారిపోతుంది. దీనిని మెడికల్‌ పరిభాషలో ‘సైనోసిస్‌’ అంటారు. మరీముఖ్యంగా పెదవులతో పాటు ముఖం అంతా నీలి రంగులోకి మారుపోతుంది. అయితే మళ్లీ కాసేపటికే సాధారణ స్థితికి వచ్చేస్తారు.

ఇది ఎవరిలో కనిపిస్తుంది.?

సాధారణంగా ఈ బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్య మొండిపట్టుతో ఏడిచే పిల్లల్లో కనిపిస్తుంది. అయితే చిన్నారులు ఇలా ఊపిరి ఆపివేసేలా ఏడవడానికి పలు కారణాలు ఉన్నాయి. విపరీతమైన నొప్పి లేదా వారు చేస్తోన్న పనిని ఉన్నపలంగా అడ్డుకోవడం, తన మాట వినడం లేదనే మొండి తనంతో ఏడుపు మొదలై తార స్థాయికి చేరుతుంది. ఈ సమయంలోనే ఊపిరి అందక అసాధారణంగా ప్రవర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్నారులు చేతులు వంకర్లు పోవడం, కళ్లు తేలేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఇవి దాదాపు ఫిట్స్‌తో సమానమైన లక్షణాలను కలిగిఉంటాయి. అయితే ఏడిచిన ప్రతీసారి ఇలా జరుగుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం కానీ.. నిమిషానికి మించి ఏడిస్తే మాత్రం ఎక్కువ శరీరం రంగు మారే అవకాశాలు ఉంటాయి. ఇక ఫిట్స్‌కి గుక్కపట్టి ఏడవడానికి చాలా తేడా ఉంటుంది. ప్రతీ 5గురు చిన్నారుల్లో ఒకరు బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్యతో బాధపడతారని అంచనా.

ఈ సమస్యను ఎలా అధిగమించాలి..

బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్యకు ప్రత్యేకంగా చికిత్స లేదనే చెప్పాలి. సాధారణంగా ఈ సమస్య చిన్నారులు పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి. అయితే కొందరిలో మాత్రం ఐరన్‌, హిమో గ్లోబిన్‌ లోపం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ లోపాలకు చెక్‌ పెట్టడానికి మెడిసిన్‌ ఇవ్వడం లేదా చిన్నారుల ఆహారంలో ఆకుకూరలు, చక్కెర బదులు బెల్లం ఇవ్వడంతో ఐరన్‌ను అందిస్తే సమస్యను అధిగమించవచ్చు. మెడిసిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి కాబట్టి ఆహారంలో మార్పులు చేయడమే ఉత్తమం.

పేరెంట్స్‌ ఏం చేయాలి..

ఈ సమస్య పెద్దగా ప్రమాదకరమైంది కాకపోయినప్పటికీ అజాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా చిన్నారులను పెద్దలు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారిని మరీ గారాబం చేయకూడదు. అడిగిన ప్రతీది ఇచ్చి ఒకేసారి నో అని చెబితే కూడా ఇలా ఏడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల ఆలోచనను ఒకదాని నుంచి మరొక దానికి డైవర్ట్‌ చేస్తుండాలి.

Also Read: Narendra Modi: బ్యాంకు మొండి బకాయిలు పెరగడానికి అదే కారణం.. కాగ్‌ను అనుమానించడం కరెక్ట్‌ కాదు.. ఆడిట్‌ దివస్‌లో ప్రధాని మోడీ..

Samsung Galaxy A32: గేలక్సీ ఏ32 కొత్త వేరియంట్ విడుదల చేసిన శాంసంగ్.. దీని ధర ఎంతంటే..

Coronavirus: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా ఉధృతి.. అటు యూరప్‌లో ఇటు కేరళలో ఒకే విధంగా..

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ