Narendra Modi: బ్యాంకు మొండి బకాయిలు పెరగడానికి అదే కారణం.. కాగ్‌ను అనుమానించడం కరెక్ట్ కాదు.. ఆడిట్ దివస్‌లో ప్రధాని మోడీ..
తంలో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత లోపించడం వల్లే నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండి బకాయిలు పెరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు
గతంలో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత లోపించడం వల్లే నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండి బకాయిలు పెరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ముఖ్యంగా గత కాంగ్రెస్ నాయకుల పాలనలోనే బ్యాంకు నిరర్థక ఆస్తులు బాగా పెరిగాయని, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) కూడా ఇదే చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మొదటి ఆడిట్ దివస్ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని కాగ్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం కాగ్ పనితీరు, బ్యాంక్ ఎన్‌పీఏల గురించి ప్రసంగించారు.
కాగ్ మన వారసత్వ సంపద.. ‘కొన్ని సంస్థలు దశాబ్ధాల తర్వాత ఎంతో కొంత ప్రాభవాన్ని కోల్పోతుంటాయి. కానీ కాగ్ అలా కాదు. అది మన వారసత్వ సంపద. గతంలో కాగ్ అంటేనే చాలామంది అనుమాణంగా చూసేవారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడమే దాని పని అని భావించే వారు. కానీ అది ఏ మాత్రం సమర్థనీయం కాదు. కాగ్ అనేది ఓ ఆడిట్ వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాబడి, ఖర్చులను, రసీదులన్నింటినీ ఆడిట్ చేస్తుంది. తద్వారా ఆయా ప్రభుత్వాల పాలనలో ఒక పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరగానికి పారదర్శకత లోపించడమే ప్రధాన కారణం. ముఖ్యంగా గత కాంగ్రెస్ పాలకుల కాలంలో ఇవి బాగా పెరిగాయి. గత ప్రభుత్వాలపై బురద చల్లడానికి మేం ఇలా చెప్పడం లేదు. అప్పటి వాస్తవ పరిస్థితులను నిజాయతీగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. సమస్యల మూలాలను కనుగొంటనే వాటికి పరిష్కారం కనుక్కోగలం’ అని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు విషయంపై స్పందించిన ప్రధాని ‘ పెద్ద నోట్ల రద్దు వల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన పునరుత్తేజం వచ్చింది. మేం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగింది. ప్రశంసలు వచ్చాయి’ అని తెలిపారు.
Addressing the programme to mark Audit Diwas. https://t.co/3Ow7gJ1Kuh
— Narendra Modi (@narendramodi) November 16, 2021
Also Read:
TTD: ఆలయాల రోజువారీ వ్యవహారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు..
Nirmala Sitharaman: పెట్రో ధరల భారం తగ్గాలంటే వారిని నిలదీయండి.. నిర్మలా సీతారామన్ సలహా