Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy A32: గేలక్సీ ఏ32 కొత్త వేరియంట్ విడుదల చేసిన శాంసంగ్.. దీని ధర ఎంతంటే..

శాంసంగ్(Samsung) తన కొత్త స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గేలక్సీ ఏ32(Samsung Galaxy A32)లో కొత్త వేరియంట్‌ను మన దేశంలో విడుదల చేసింది.

Samsung Galaxy A32: గేలక్సీ ఏ32 కొత్త వేరియంట్ విడుదల చేసిన శాంసంగ్.. దీని ధర ఎంతంటే..
Samsung Galaxy A32 Smartphone
Follow us
KVD Varma

|

Updated on: Nov 16, 2021 | 12:25 PM

Samsung Galaxy A32: శాంసంగ్(Samsung) తన కొత్త స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గేలక్సీ ఏ32(Samsung Galaxy A32)లో కొత్త వేరియంట్‌ను మన దేశంలో విడుదల చేసింది. గేలక్సీ ఏ32 ఇప్పుడు 8GB RAM అలాగే 128GB స్టోరేజీతో కూడా కొనుగోలు చేయవచ్చు. గేలక్సీ ఏ32 మోడల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చిలో భారతదేశంలో విడుదలైంది. గేలక్సీ ఏ32 గతంలో గ్లోబల్ మార్కెట్ రష్యా,యూకేలో 4G, 5G కనెక్టివిటీతో ప్రారంభం అయింది. అయితే శాంసంగ్ ఇండియా ఈ ఫోన్‌లో 5G కనెక్టివిటీని ఇవ్వలేదు.

ధర ఎంతంటే..

శాంసంగ్ గేలక్సీ ఏ32 8GB RAM..128GB స్టోరేజ్ మోడల్ రూ.23,499కి విడుదల చేశారు. దీన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గేలక్సీ ఏ32 ఈ సంవత్సరం మార్చిలో రూ. 21,999 ప్రారంభ ధరతో పరిచయం అయింది. అయితే, ఈ ధర లో ఈ ఫోన్ 6GB RAMతో 128GB స్టోరేజ్ ను పొందుతారు. ఫోన్‌ను ఓస్మ్ బ్లాక్, ఓస్మ్ వైట్, ఓస్మ్ బ్లూ, ఓస్మ్ వైలెట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A32 4G స్పెసిఫికేషన్‌లు

90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ U నాచ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. ఫోన్‌కు MediaTek Helio G80 ప్రాసెసర్, 8GB RAM, 128GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. దీన్ని మెమరీ కార్డ్ సహాయంతో 1TBకి పెంచుకోవచ్చు. 8GB RAM మోడల్‌తో పాటు 4GB వర్చువల్ RAM కూడా అందుబాటులో ఉంటుంది.

నాలుగు వెనుక కెమెరాలు..

నాలుగు వెనుక కెమెరాలు ఈ ఫోన్ తో అందుబాటులో ఉంటాయి. Galaxy A32 ప్రధాన లెన్స్ 64 మెగాపిక్సెల్ దీని ఎపర్చరు f/1.8. మరోవైపు, రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 5-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అలాగే, నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీ కోసం, శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చింది.

5000mAh బ్యాటరీ

ఈ ఫోన్ బ్యాటరీ 5000mAh ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 15Wకి మద్దతు ఇస్తుంది. ఛార్జింగ్ కోసం ఫోన్‌లో యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఇచ్చారు. ఫోన్ బరువు 184 గ్రాములు. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..