Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Thyroid Problem: ఇప్పుడున్న కాలంలో ఎంతో మందికి రకరకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. అందుకు కారణం జీవనశైలి. కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మన ఆరోగ్యాన్ని..

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 2:17 PM

Thyroid Problem: ఇప్పుడున్న కాలంలో ఎంతో మందికి రకరకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. అందుకు కారణం జీవనశైలి. కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మన ఆరోగ్యాన్ని అదుపులోనే పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఈ స్త్రీల విషయంలో అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకుంటే అందుకు కారణాలు కూడా ఉంటాయి. ఇక చాలా మంది స్త్రీలలో థైరాయిడ్‌ ఉంటుంది. థైరాయిడ్‌ అనేది శరీరంలో జీవక్రియను నియంత్రిస్తుంది. మిగతా గ్రంథులు సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్‌ అనే ఎండోక్రైన్‌ చాలా అవసరం. థైరాయిడ్‌ హార్మోన్లలో సమతుల్యత లోపించినట్లయితే, అది ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల పనితీరునుకు ఆటంకం ఏర్పడుతుంది. దీని ద్వారా స్త్రీలలో అండం విడుదల జరగకపోవడంతో సంతానలేమి సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే థైరాయిడ్‌ సమస్య ఉన్నంత మాత్రాన వందశాతం సంతానలేమి అంటూ ఉండదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే తప్పకుండా గర్భం ధరించవచ్చు.

థైరాయిడ్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌.. థైరాయిడ్‌తో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిన వెంటనే థైరాయిడ్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ (టీఎఫ్‌టీ) చేయించుకోవడం తప్పనిసరి. అప్పుడు గర్భిణీకి ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ధారిస్తారు. అలా థైరాయిడ్‌ను అదుపులో పెట్టుకోకపోతే పుట్టబోయే బిడ్డకు అవయవాలు లోపించే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా కడుపులో పిండం ఎదగకపోవడంతో గర్భంలో బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందుకే థైరాయిడ్‌ ఉన్న మహిళలు గర్భం దాల్చినట్లయితే వైద్యుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వారు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని చెబుతున్నారు. ఇలా థైరాయిడ్‌ ఉన్న మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడితే ఎలాంటి సమస్య ఉండదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Pneumonia: చలి పెరుగుతోంది.. ఊపిరితిత్తుల వ్యాధి న్యుమోనియాతో జాగ్రత్తగా ఉండాలి.. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి!

Ghee and Oil: బరువు పెరుగుతున్నామని నెయ్యి.. నూనెలను దూరం పెట్టేస్తున్నారా? అయితే, మీకు అనారోగ్యం ఖాయం ఎలా అంటే..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది