AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking Tea: టీతో పాటు సిగరెట్‌ తాగుతున్నారా? ఎలాంటి ప్రమాదమో తెలిస్తే గుండెలో దడ పుడుతుంది!

Smoking Tea: టీ, సిగరెట్‌ రెండింటిని ఒకసారి తాగుతుండటం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టీతో సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమైన ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం.. ధూమపానం, మద్యపానం చేసేవారిలో

Smoking Tea: టీతో పాటు సిగరెట్‌ తాగుతున్నారా? ఎలాంటి ప్రమాదమో తెలిస్తే గుండెలో దడ పుడుతుంది!
Subhash Goud
|

Updated on: Jan 19, 2025 | 9:09 PM

Share

చాలా మందికి సిగరెట్‌ అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినా పెద్దగా పట్టించుకోరు. సిగరెట్‌ తాగడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తరచుగా ఉద్యోగులు కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు అలసిపోయినట్లు అనిపించినప్పుడు వారు తమను తాము రిఫ్రెష్ చేసుకోవడానికి మధ్యలో టీ విరామం తీసుకుంటారు. ఇలా రిలాక్స్‌ అయ్యేందుకు టీ, సిగరెట్‌ తాగుతుంటారు. అలాగే కొందరికి మద్యం తాగిన సమయంలో కూడా తప్పనిసరిగ్గా సిగరెట్‌ తాగాల్సిందే. ఇక చాలా మంది టీ తాగుతూ సిగరెట్‌ కాల్చుతుంటారు. అలా టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు కలిపి తీసుకోవడం ప్రమాదం:

టీ, సిగరెట్‌ రెండింటిని ఒకసారి తాగుతుండటం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బులతో పాటు క్యాన్సన్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టీతో సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమైన ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం.. ధూమపానం, మద్యపానం చేసేవారిలో క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

టీ, సిగరెట్‌ రెండింటిని కలిపి తాగడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 30 శాతం ఉంటుందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ (Annals of Internal Medicine) నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. వేడి టీ జీర్ణ కణాలను దెబ్బతీస్తుందని, టీ-సిగరెట్‌ను కలిపి తాగడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది.

ఇక తాగే టీలో కెఫీన్‌ ఉంటుందని, దీని కారణంగా కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ లేదా బీడీలలో నికోటిన్ ఉంటుందని, టీలో కెఫీన్‌ ఉంటుంది. ఈ రెండింటి వల్ల రక్తపోటును పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయంటున్నారు. అంతేకాదు రక్తనాళాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందట. అందుకే అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఇతర గుండె సంబంధిత వ్యాధులు రావడం ప్రారంభమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే టీ, సిగరెట్‌ వల్ల మలబద్దకం, అజీర్తి, అల్సర్‌ వంటి సమస్యలు పెరుగుతాయని పేర్కొంటున్నారు.

ఒక సిగరెట్‌లో దాదాపు 6-12 mg నికోటిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తి కంటే 2-3 రెట్లు ఎక్కువ. సిగరెట్‌లలో ఉండే నికోటిన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల సంకోచానికి కారణమవుతుంది. దీని కారణంగా గుండెకు స్వచ్ఛమైన రక్తం సరఫరా కాదు. అలాగే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. టీలో ఉండే పాలీఫెనాల్స్ అనే సహజ మూలకాలు సాధారణంగా గుండె ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. కానీ టీతో కలిపి సిగరెట్‌ తాగడం మంచి లక్షణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల కలిగే నష్టాలు:

టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం కూడా వెల్లడించింది. టీలో ఉండే టాక్సిన్స్ సిగరెట్ పొగలో కలిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందువల్ల, టీతో పాటు సిగరెట్ తాగకూడదు.

– గుండె, మెదడు స్ట్రోక్ ప్రమాదం

– చేతులు, కాళ్ళలో పుండు (గ్యాంగ్రీన్)

– జ్ఞాపకశక్తి కోల్పోవడం

– ఊపిరితిత్తులలో సంకోచం

-కడుపు సమస్యలు

– సంతానలేమి సమస్య

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి