AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Addiction: నిద్రను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి.

Smartphone Addiction: ఈ శతాబ్ధపు అద్భుత ఆవిష్కరణల్లో స్మార్ట్‌ఫోన్‌ ఒకటి. ఒకప్పుడు కేవలం సంభాషణలకు మాత్రమే పరితమైన మొబైల్‌ ఫోన్‌ వ్యవస్థ స్మార్ట్‌ ఫోన్‌ రాకతో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌ వైపు చూడాల్సిందే. ఇతరులతో...

Smartphone Addiction: నిద్రను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి.
Smart Phone
Narender Vaitla
|

Updated on: Mar 17, 2021 | 10:48 PM

Share

Smartphone Addiction: ఈ శతాబ్ధపు అద్భుత ఆవిష్కరణల్లో స్మార్ట్‌ఫోన్‌ ఒకటి. ఒకప్పుడు కేవలం సంభాషణలకు మాత్రమే పరితమైన మొబైల్‌ ఫోన్‌ వ్యవస్థ స్మార్ట్‌ ఫోన్‌ రాకతో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌ వైపు చూడాల్సిందే. ఇతరులతో మాట్లాడుకోవడం నుంచి మొదలు పెడితే, చాటింగ్‌, వీడియోలు, సోషల్ మీడియా, డబ్బులు పంపించుకోవడం ఇలా ప్రతీ అవసరానికి స్మార్ట్‌ ఫోన్‌ కేరాఫ్‌గా మారిపోయింది. అయితే ఏదైనా అతి అయితే అది అనార్థానికే దారి తీస్తుంది అనడానికి స్మార్ట్‌ఫోన్‌ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యూజర్లకు ఎన్నో పనులు చేసి పెడతోన్న స్మార్ట్‌ఫోన్‌ వారి ఆరోగ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది. మితిమీరిన స్మార్ట్‌ ఫోన్‌ వాడకంతో వినియోగదారులు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. అయితే ఇదేదో ఆశామాషీగా చెప్పిన విషయం కాదు. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ తెలిపారు. లండన్‌కు చెందిన కింగ్స్‌ కాలేజీ చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం పరిశోధకులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 1043 మందిని పరిగణలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించి వివరాలను అడిగితెలుసుకున్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయినట్లు ఈ పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా అర్థరాత్రి దాటిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారిలో ఈ ప్రమాదం ఎక్కువ ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారు నాణ్యత లేని నిద్రతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం వల్ల ఉదయం వారి పనితీరుపై కూడా దుష్ఫ్రభావం చూపుతుందని వారు చెప్పుకొచ్చారు.

ఈ చిట్కాలు పాటించండి..

మీరు కూడా స్మార్ట్‌ ఫోన్‌కు బానిసలుగా మారారా.? స్మార్ట్‌ ఫోన్‌ మీ నిద్రపై ప్రభావం చూపుతుందా.? అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

* స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో మీకు మీరు కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. ముఖ్యంగా రోజులో కొంత సమయం పాటు స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఆహారం తీసుకునే సమయంలో, మీ చిన్నారులతో గడిపే సమయంలో, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు.

* మీరు ఎక్కువగా ఎలాంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నారో వాటిని ముందుగా స్మార్ట్‌ఫోన్‌ నుంచి అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయాలి. ముఖ్యంగా మిమ్మల్ని స్మార్ట్‌ ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే సోషల్‌ మీడియా యాప్‌లను డిలీట్‌ చేసేయాలి.

* నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్‌ ఫోన్‌కు గుడ్‌ బై చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వెలువడే బ్లూ లైట్‌ మీ నిద్రపై ప్రభావం చూపుతుందనేది శాస్త్రవేత్తల వాదన.

Also Read: Supta Vajrasana Pose : ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. ఎన్నిమందులు వాడినా ఫలితం లేదా.. ఈ ఆసనం ట్రై చేసి చూడండి

ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..

Whatsapp New Feature: వాట్సాప్‌ నుంచి మరో ఇంటరెస్టింగ్ ఫీచర్.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..!

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..