వేసవిలో అధిక చెమటతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఇలా చేసి రిలీఫ్ పొందండి..
Sweat Well Try These Tips : గత కొద్ది రోజుల నుంచీ ఎండలు మరింత పెరిగాయి. చాలా మందిని చెమట సమస్య కూడా ఇబ్బంది పెడుతున్నది. అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. అధిక చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగర్, 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.
1 / 5
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.
2 / 5
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.
3 / 5
నిత్యం ఏదైనా ఒక సమయంలో 1 గ్లాస్ టమాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమట పట్టకుండా చూసుకోవచ్చు.
4 / 5
కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని చంకల్లో రాయాలి. చంకల్లో ఎలాంటి తడి లేకుండా చూసుకుని ఆ మిశ్రమాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.