High Cholesterol: తస్మాత్ జాగ్రత్త.. మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే..
High Cholesterol: శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి కొవ్వులు కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు.
High Cholesterol: శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి కొవ్వులు కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొవ్వుల్లో రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌తో ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్‌తో ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, శరీరంలో.. ముఖ్యంగా కాళ్లలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వాటిలో ఒకటి అధిక కొలెస్ట్రాల్. అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఏం జరుగుతుందంటే.. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. ఇది కణ త్వచాలు, విటమిన్ డి, హార్మోన్ల సమతుల్యం కోసం కాలేయం ద్వారా ఉత్పిత్త అవుతుంది. నీటిలో కరగని కారణంగా.. లిపోప్రోటీన్ అనేక కణం ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలోని వివిధ భాగాలకు రవాణా చేయబడుతుంది. కొవ్వుల ఉపరితలంపై నిర్దిష్ట ప్రోటీన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అధిక కొవ్వు, తక్కువ ప్రోటీన్ కంటెంట్ లిపోప్రొటీన్‌తో కలిపి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌లు (LDL) ఏర్పడినప్పుడు మాత్రమే అది శరీరానికి హానికరం. మీ ఆహారం అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాలను అధికంగా తీసుకుంటూ.. నిశ్చలంగా జీవితం గడుపుతున్నట్లయితే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆ కొవ్వు పదార్థాలు గుండెలోని ధమనులలో పేరుకోవడం మొదలవుతుంది. కాలక్రమేణా గుండెపోటుకు దారి తీస్తుంది.
కాళ్లలో అధిక కొవ్వు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది?.. కొలెస్ట్రాల్ ఏర్పడటంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి చేరుకుని మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. రోగ నిర్ధారణ, నివారించడానికి ఏకైక మార్గం క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోవడం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు, అది మీ కాళ్ల అకిలెస్ స్నాయువుపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది.
కాళ్లలో నొప్పి.. మీ కాళ్ల ధమనులు మూసుకుపోయినప్పుడు.. తగినంత ఆక్సిజన్, రక్తం కాళ్ల దిగువ భాగానికి చేరదు. ఇది మీ కాలు బరువుగా, అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న చాలా మంది ప్రజల కాళ్లలో మంటలు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. తొడలు లేదా పిక్కల భాగంలో నొప్పిగా ఉంటుంది. నడిచిన సమయంలో కాళ్ల నొప్పులు వస్తాయి.
కాళ్ల తిమ్మిరి.. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే.. నిద్రుస్తున్న సమయంలో కాళ్ల తిమ్మిరి అధికంగా వస్తుంటుంది. మడమ, ముందరి పాదాలు, కాలి వేళ్లలో తిమ్మిర్లు వస్తాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. మంచం మీద నుంచి కాళ్లు కిందకు వేయడం, కూర్చోవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
చర్మం, గోరు రంగులో మార్పు.. రక్తం ప్రవాహంలో తగ్గుదల ఉన్నట్లయితే.. గోళ్లు, చర్మం రంగులో మార్పు వస్తుంది. పోషకాలు, ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహం తగ్గడం వల్ల కణాలు సరైన పోషణను పొందలేకపోవడం దీనికి ప్రధాన కారణం. చర్మం మెరిసేలా, బిగుతుగా ఉంటుంది. కాలి గోరు మందంగా, నెమ్మదిగా పెరుగుతుంది.
పాదాలు చల్లగా ఉంటాయి.. చలికాలంలో పాదాలు ఎలా చల్లగా ఉంటాయో.. అధిక కొలెస్ట్రాల్ ఉంటే అంతే చల్లగా మీ పాదాలు ఉంటాయి. ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటాయి. వేసవిలో కూడా పాదాలను తాకితే పాదాలు చల్లగా అనిపిస్తాయి. ఇది పీఏడీ సూచన అని, ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also read:
Cheating Case: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. 4000 వేల గొర్రెలతో పరార్.. ఆ తర్వాత మరో ట్విస్ట్..
TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. దసరా పండుగకు 4,045 ప్రత్యేక బస్సులు..
Child Parenting Tips: ఈ 5 విషయాలు మీ పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడదు.. ఎందుకో తెలుసా?..