AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt: ఉప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ లక్షణాలుంటే.. ఆ జబ్బుల బారిన పడినట్లే..

Eating Too Much Salt: మనం నిత్యం రుచికరమైన అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటాం. అయితే.. చాలా మంది కేవ‌లం రుచి కోస‌మే ప‌లు ఆహారపదార్థాలను చేసుకుని

Salt: ఉప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ లక్షణాలుంటే.. ఆ జబ్బుల బారిన పడినట్లే..
Signs and Symptoms of Too Much Salt eating
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2021 | 8:24 AM

Share

Eating Too Much Salt: మనం నిత్యం రుచికరమైన అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటాం. అయితే.. చాలా మంది కేవ‌లం రుచి కోస‌మే ప‌లు ఆహారపదార్థాలను చేసుకుని తింటూ ఆస్వాదిస్తుంటారు. ఒక్క తిపి వంటకాలు మినహా.. ఏ రకం వంట అయినా సరే.. ఉప్పు లేకుండా అస్సలు రుచి రాదు. కూర అయినా.. వేరే ఆహారమైనా.. ఉప్పు త‌గినంత ప‌డాల్సిందే. అయితే ఉప్పు త‌గినంత తింటే మ‌న ఆరోగ్యానికి ఏమీ కాదు. కానీ ఉప్పు ఎక్కువ తింటే మాత్రం మ‌న‌కు బోలెడన్నీ అనారోగ్య సమస్యలు వ‌స్తాలీ. బీపీ, హార్ట్ ఎటాక్‌, కిడ్నీ.. ఇలా అనేక స‌మ‌స్యలు వ‌స్తాయి. అయితే.. ఉప్పు మోతాదు మించితే ఆరోగ్యం విషయంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. ఆ ల‌క్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పు ఎక్కువ‌గా తింటే మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వ‌స్తుంది. మీకు డ‌యాబెటిస్ లేకపోయినా.. మూత్ర విస‌రర్జన ఎక్కువ‌గా అవుతుంటే.. మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి.

ఉప్పు ఎక్కువ‌గా తింటే మూత్ర విసర్జనకు ఎక్కువ‌గా వెళతాం.. కావున దాహం కూడా మ‌న‌కు ఎక్కువ‌గా వేస్తుంది. కనుక ఈ ల‌క్షణం క‌నిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి.

ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో వాపులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాలి మ‌డ‌మ భాగంలో శరీరం ఉబ్బుతుంది. దానికి కార‌ణం ఆ భాగంలో నీరు ఎక్కువ‌గా చేర‌డ‌మే. ఉప్పు ఎక్కువ‌గా తినేవారిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. దీన్నే ఎడిమా అంటారు.

ఉప్పు బాగా తింటే నాలుక‌పై ఉండే రుచి క‌ళిక‌లు ఇత‌ర రుచుల‌ను గుర్తించ‌లేవు. ఫ‌లితంగా ఏది తిన్నా అంతగా రుచించదు. ఈ స‌మ‌స్య ఉంటే మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవచ్చు.

ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో నీటి శాతం త్వరగా అయిపోతుంది. ఫ‌లితంగా డీహైడ్రేష‌న్ బారిన ప‌డి త‌ల‌నొప్పి, నీరసం వ‌స్తుంది. కావున మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. ఉప్పును తగ్గించుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

air Fall: జుట్టు బాగా రాలిపోతుందా?.. ఈ 3 హోమ్ రెమెడీస్ ట్రై చెయ్యండి.. అద్భుతమైన ఫలితాలు చూడండి..!

Weight Loss: బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ మూడు తాగండి.. ఫలితం చూసి షాక్ అవుతారు..!