Hair Fall: జుట్టు బాగా రాలిపోతుందా?.. ఈ 3 హోమ్ రెమెడీస్ ట్రై చెయ్యండి.. అద్భుతమైన ఫలితాలు చూడండి..!

Hair Fall: జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, శరీరంలో హార్మోన్ల లోపాలు, వాతావరణంలో మార్పులు కూడా జట్టు రాలిపోవడానికి కారణాలు.

Hair Fall: జుట్టు బాగా రాలిపోతుందా?.. ఈ 3 హోమ్ రెమెడీస్ ట్రై చెయ్యండి.. అద్భుతమైన ఫలితాలు చూడండి..!
Hair Loss
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2021 | 7:49 AM

Hair Fall: జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, శరీరంలో హార్మోన్ల లోపాలు, వాతావరణంలో మార్పులు కూడా జట్టు రాలిపోవడానికి కారణాలు. వర్షాకాలం వచ్చిందంటే.. తేమ కారణంగా జుట్టు రాలిపోవడం, చండ్రు ఏర్పడటం వంటివి జరుగుతుంటాయి. అయితే, మనకు ఇంటి పెరట్లో, వంటింట్లో మనం నిత్యం వాడే పదార్థాలతో జుట్టు రాలిపోవడానికి చెక్ పెట్టొచ్చు. పైగా జుట్టు వేగంగా పెరిగేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయిల్ ట్రీట్‌మెంట్.. కావాల్సిన పదార్థాలు.. 1. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె. 2. 2 టేబుల్ స్పూన్ కాస్టర్డ్ ఆయిల్. 3. ఐదు నుంచి ఆరు కరివేపాకు రెబ్బలు.

తయారీ ప్రక్రియ.. 1. పొయ్యి మీద ఒక పాన్ ఉంచండి మరియు రెండింటికి నూనె జోడించండి. 2. నూనె వేడి అయ్యాక ఆకులు చల్లుకోవాలి. 3. రెండు నిమిషాల తర్వాత మంటను ఆపివేసి, చల్లబరచండి. 4. మీ నెత్తిపై నూనెను మసాజ్ చేయడానికి కాటన్ బాల్స్ తీసుకోండి. 5. ఒక గంట సేపు జుట్టును ఆరనివ్వాలి. 6. చల్లటి నీరు, షాంపూతో కడగాలి.

హెయిర్ మాస్క్.. కావాల్సిన పదార్థాలు.. 1. అర టేబుల్ స్ఫూన్ ఉసిరికాయ ఫౌడర్. 2. అర టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం. 3. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

తయారీ ప్రక్రియ.. 1. అన్ని పదార్థాలను బాగా కలపండి. 2. ఆ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి. 3. ఒక గంట సేపు అలాగే ఉంచి.. ఆ తరువాత మంచినీటితో కడగాలి.

ఆయిల్, జెల్ ట్రీట్‌మెంట్.. కావాల్సిన పదార్థాలు.. 1. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె 2. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్. 3. ఒక టేబుల్ స్పూన్ మెంతి నూనె

తయారీ ప్రక్రియ.. 1. వీటన్నింటినీ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. 2. ఈ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి. 3. ఒక గంట సేపు జుట్టును ఆరనివ్వాలి. 4. ఆ తరువాత మంచినీటితో, షాంపుతో కడగాలి.

Also read:

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. దేశంలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి…