Beatroot Effects: బీట్‌రూట్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మంచి ఆరోగ్యం కోసం చాలా మంది ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను తీసుకుంటాం. చాలామంది ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాల్లో బీట్ రూట్ ను తీసుకుంటారు. కొంతమంది బీట్ రూట్ అంటే ఇష్టపడరు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన వారు అవకాశం ఉన్నప్పుడు..

Beatroot Effects: బీట్‌రూట్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Beetroot
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 06, 2022 | 9:42 PM

మంచి ఆరోగ్యం కోసం చాలా మంది ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను తీసుకుంటాం. చాలామంది ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాల్లో బీట్ రూట్ ను తీసుకుంటారు. కొంతమంది బీట్ రూట్ అంటే ఇష్టపడరు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన వారు అవకాశం ఉన్నప్పుడు ఇది తీసుకోకుండా ఉండరు. కూరలుగా చేసుకోవడంతో పాటు, జ్యూస్ గానూ బీట్ రూట్ ను తీసుకుంటూ ఉంటారు. బీట్ రూట్ లో విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే బీట్ రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఈబీట్ రూట్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ ను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో బీట్ రూట్ తినకూడదో తెలుసుకుందాం.

అలెర్జీ

బిట్ రూట్‌లో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికి కొంత మంది వాటిని తినడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అలెర్జీతో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటివి మరింత తీవ్రమవుతాయి. అలెర్జీతో బాధపడేవారు బీట్ రూట్ ను తమ డైట్ లో తీసుకోకూడదు.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు

ఆక్సలేట్ కలిగి ఉండే వ్యక్తుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వాస్తవానికి బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే దుంపలు తినడాన్ని నివారించవచ్చు. ఒకవేళ తిన్నా చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం

బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. చక్కెర స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు బీట్‌రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి.

కాలేయం సమస్య

బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. బీట్‌రూట్‌లో కాపర్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఖనిజాలు కాలేయంలో పెద్ద మొత్తంలో చేరడం వల్ల.. అవి తీవ్రంగా దెబ్బతీంటాయి. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకల సమస్యను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..