Shoulder Pain Health Tips: తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి

Surya Kala

Surya Kala |

Updated on: Oct 05, 2021 | 7:23 PM

Shoulder Pain Health Tips: ప్రస్తుతం సమయంతో పనిలేకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు..తగ్గిన శారీరక శ్రమ.. దీంతో ఎక్కువ మంది భుజాల నొప్పితో..

Shoulder Pain Health Tips: తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి
Shoulder Pain Home Remedy

Follow us on

Shoulder Pain Health Tips: ప్రస్తుతం సమయంతో పనిలేకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు..తగ్గిన శారీరక శ్రమ.. దీంతో ఎక్కువ మంది భుజాల నొప్పితో బాధపడుతున్నారు. వినేవారికి ఇది చిన్న సమస్య.. అదే భుజం నొప్పితో బాధపడేవారికి నరకంలో సమానం. ఒకొక్కసారి చేతులను పైకి ఎత్తలేరు, బరువు వస్తువులను ఎత్తలేరు, కంప్యూటర్ ముందు పనిచేయలేరు. ఎంతగా ఇబ్బందిపడతారంటే.. సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తే.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఆలా భుజం నొప్పితో ఇబ్బందిపడేవారు ఈ సింపుల్ టిప్స్ తో నివారించుకోవచ్చు.

*ఫార్మసీలు, మందుల దుకాణాల్లో లభించే ఎప్సమ్ ఉప్పు భుజాల నొప్పిని త‌గ్గించ‌డంలో అద్భుతంగా పనిచేస్తుంది. బ‌కెట్ వేడి నీటిలో అర క‌ప్పు వ‌ర‌కు ఎప్సోమ్ ఉప్పు వేసి క‌రిగించండి. అపై ఈ వాట‌ర్‌తో స్నానం చేయండి. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయం ఇలా చేస్తే కండరాల యొక్క ఒత్తిడి త‌గ్గి. రక్త ప్రసరణ మెరుగు ప‌డుతుంది. దీంతో భుజాల నొప్పి తగ్గుతుంది.

*ఐస్ థెర‌పీ కూడా భుజాల నొప్పిని స‌మ‌ర్థ‌వంతంగా తగ్గిస్తుంది. ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్క‌ల‌ను చుట్టు దీనిని భుజాల‌పై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే. క్రమంగా భుజం నొప్పి తగ్గుతుంది.

*భుజాల నొప్పికి పసుపు మంచి మెడిసిన్. ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల ప‌సుపు, నాలుగు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని భుజాల‌కు అప్లై చేసి.. బాగా డ్రై అయ్యేవరకూ ఉండాలి. తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే.. భుజం నొప్పిని నుంచి ఉపశమనం లభిస్తుంది.

*కండరాలు బలహీనమైనప్పుడు కూడా భుజాలు నొప్పి వస్తాయి. తినే ఆహారంలో కండ‌రాల‌కు బలం ఇచ్చే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అంతేకాదు భుజాల నొప్పితో బాధ ప‌డే వారు ఆట‌లు ఆడ‌టం కూడదు. బ‌రువైన వ‌స్తువులు ఎత్తకూడదు. ఇక ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. చిన్నపాటి యోగాసనాలు వేస్తే భుజాల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Also Read: ఇదే మా కథ సినిమా చూడండి.. ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి… వివరాల్లోకి వెళ్తే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu