Idhe Maa Katha Movie: ఇదే మా కథ సినిమా చూడండి.. ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి… వివరాల్లోకి వెళ్తే..
Idhe Maa Katha Movie: కొన్ని ఏళ్ల క్రితం.. పల్లెల్లో సినిమాలు చూసిన వారి టికెట్స్ ను డ్రాగా తీసి.. స్టీల్ గిన్నెలు ఫ్యాన్స్ వంటి వస్తువులను బహుమతులుగా..
Idhe Maa Katha Movie: కొన్ని ఏళ్ల క్రితం.. పల్లెల్లో సినిమాలు చూసిన వారి టికెట్స్ ను డ్రాగా తీసి.. స్టీల్ గిన్నెలు ఫ్యాన్స్ వంటి వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇక మాతృదేవోభవ సినిమాకు అయితే .. సినిమా చూసి ఏడవకుండా వచ్చినవారికి నగదు బహుమతిని ప్రకటించారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల సందడి కొనసాగుతోంది. విభిన్న కథానేపధ్య సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇదే మా కథ’ సినిమా కూడా శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమం చేస్తోంది. తాజాగా ఇదే మా కథ సినిమా యూనిట్ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్,తాన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జర్నీ కాన్సెప్ట్ తో రూపొందింది. ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ సినిమా పై మరింత పబ్లిసిటీ పెంచడం కోసం చిత్రబృందం సరికొత్త కాన్సెప్ ను ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం .. థియేటర్స్ కు వైపు రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇదే మా కథ టికెట్స్ ఫోటో తీసి #IdheMaaKatha హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇలా పోస్ట్ చేసిన వారిలో లక్కీ డ్రా తీసి వారికి ఎన్ ఫీల్డ్ బైక్స్ ఇవ్వబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Also Read: ‘టచ్ ఇట్’ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన ఎయిర్‌హోస్టెస్… యూత్‌తో పాటు బాలీవుడ్ కూడా ఫిదా..