Varun Tej: మొదటి పంచ్ కొట్టడానికి సిద్ధమైన ‘గని’.. వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్‌డేట్ ఎప్పుడంటే..
Varun Tej: 'ఎఫ్2', 'గద్దల కొండ గణేశ్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా..
Varun Tej: ‘ఎఫ్2’, ‘గద్దల కొండ గణేశ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వరుణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. మునుపెన్నడూ లేని విధంగా వరుణ్ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలతో బాడీ పెంచాడు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా మళ్లీ పరిస్థితులు మెరుగుపడడంతో సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభమైంది. ఇక ఈ సినిమా నుంచి అప్‌డేట్ రాక చాలా కాలం అవుతుండడంతో వరుణ్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అభిమానుల నిరీక్షణకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తాజాగా సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Buckle up!???#Ghani pic.twitter.com/TgBFGukvqk
— Varun Tej Konidela ? (@IAmVarunTej) October 5, 2021
రేపు అంటే బుధవారం ‘గని’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై వరుణ్ ట్విట్టర్ వేదికగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘రేపు సాయంత్రం 5:05 గంటలకు ఫస్ట్ పంచ్ వచ్చేస్తోంది’ అంటూ తెలిపారు. దీంతో వరుణ్ ఫ్యాన్స్ ఆ పంచ్ ఏంటా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Aryan Khan Arrest: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి… కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..
Kondapolam Pre Release Event: వైష్ణవ్ తేజ్ కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..