Bigg Boss 5 Telugu: రాజ్యానికి రాజయ్యేది ఎవరు.? ఆసక్తికరంగా బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్.. సిరి, షణ్ముఖ్ ఎందుకలా చేశారు.?
Bigg Boss 5 Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు పూర్తయిన ఈ షోపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది...
Bigg Boss 5 Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు పూర్తయిన ఈ షోపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్ ఇస్తోన్న టాస్క్‌లు వాటి కారణంగా హౌజ్‌మేట్స్ మధ్య జరుగుతోన్న గొడవలు, అలకలు, మధ్య మధ్యలో ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఇదిలా ఉంటే హౌజ్ నుంచి ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్‌లు బయటకు వెళ్లి పోయారు. ఇక హౌజ్‌లో మరింత రచ్చ లేపడానికి బిగ్‌బాస్ మరో పోరుకు తెర తీశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సరికొత్త ఎత్తుగడతో ప్రేక్షకులకు ముందకు వస్తున్నాడు.
ఈ రోజు (మంగళవారం) రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రవి, సన్నీల మధ్య ‘రాజ్యానికి రాజయ్యేది ఎవరు.?’ అనే టాస్క్‌ను నిర్వహించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. టాస్క్‌లో భాగంగా రవి, సన్నీ ఇద్దరూ రాజుల మాదిరిగా గెటప్‌లో కనిపించారు. ఇక టాస్క్‌లో భాగంగా విశ్వ, శ్రీరామచంద్రల మధ్య బురదలో మల్ల యుద్ధం జరిపారు.
ఇదిలా ఉంటే టాస్క్ ప్రారంభానికి ముందు ఇద్దరికి కొన్ని నాణేలు ఇచ్చారు. ఆ నాణేలు ఇద్దరు పోటీదారులు ఓ డబ్బాలో దాచుకున్నారు. అయితే సిరి, షణ్ముఖ్‌లు కలిసి ప్రత్యర్థి జట్టుకు చెందిన కంటెస్టెంట్ నాణేలను దొగలిస్తారు. ఇది తెలిసిన విశ్వ హౌజ్‌మేట్స్‌పైకి అరుస్తాడు. ఎవరు తీశారో తెలియకపోయినప్పటికీ దొంగతనం ఎలా చేస్తారంటూ అరిచేశాడు. దమ్ముంటే ముందుకొచ్చి ఆడుకోవాలి కానీ ఈ దొంగ బుద్ధులు ఏంటి అంటూ తనదైన శైలిలో సీరియస్ అయ్యాడు. ఇక జెస్సీ కూడా నాణేలను దొంగలించినట్లు కనిపిస్తోంది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలాంటి రచ్చకు దారి తీసిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: Aaryan Khan Arrest: ఎన్‌డిపిఎస్ చట్టం కింద షారూఖ్ కొడుకు ఆర్యన్ అరెస్ట్.. అసలు ఈ చట్టం ఏం చెబుతోంది?
Samantha: చై-సామ్ విడాకుల కారణాన్ని సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ బయటపెట్టారా? వైరల్ పోస్ట్.!