Samantha: చై-సామ్ విడాకుల కారణమదేనా? సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పోస్ట్‌కి అర్ధమేంటి.?

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Oct 05, 2021 | 9:23 PM

Samantha Divorce: అక్కినేని చైతన్య-సమంతా విడిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న..

Samantha: చై-సామ్ విడాకుల కారణమదేనా? సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పోస్ట్‌కి అర్ధమేంటి.?
Jukalker Preetham
Follow us

అక్కినేని చైతన్య-సమంతా విడిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడానికి కారణాలు ఏంటి.? ఇప్పుడు ఈ ప్రశ్నే అభిమానులందరిలోనూ మెదులుతోంది. ఎప్పటిలాగే నాగ చైతన్య సైలెంట్‌గా ఉన్నప్పటికీ, సమంతా పెట్టే ఇన్‌స్టా స్టోరీస్ మాత్రం అభిమానుల్లో రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరోవైపు సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పెట్టే ఇన్‌స్టా పోస్టులు ప్రస్తుతం నెట్టింట కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. దీనిపై జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. పేర్లు ఏవి ప్రస్తావించకపోయినా.. సమంతాకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లుగా అతడి పోస్టులు సూచిస్తున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతమ్ జుకల్కర్ తొలగించిన ఓ పోస్టు చై-సామ్ విడాకులకు అసలు కారణాన్ని వెల్లడించిందా.? మానసిక వేధింపులు కారణంగానే సమంతా విడాకులు తీసుకున్నట్లుగా పేర్కొన్న ఆయన పోస్టు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

ప్రీతమ్ తొలగించిన పోస్టులో.. ” ఎవరైతే వారి ఇళ్లలో పురుషుల నిజస్వరూపాన్ని దాచిపెడతారో.. వారే మహిళలపై హింసకు బాధ్యులు” అని పేర్కొన్నారు. ‘సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్‌ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి జుకల్కర్ చేశారో తెలియదు గానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, చై-సామ్ విడాకులకు జుకల్కరే కారణమంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను వేధిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసులను ట్యాగ్ చేస్తూ జుకల్కర్ వారి అకౌంట్లకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

Also Read:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu