Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్.. ఫ్యామిలీని లాగొద్దంటూ సీరియస్..
టాలీవుడ్లో ఎన్నికల హీట్ పెరిగింది. విమర్శలు, ఆరోపణలతో మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
టాలీవుడ్లో ఎన్నికల హీట్ పెరిగింది. విమర్శలు, ఆరోపణలతో మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక అక్టోబర్ 10న మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లొసుగులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా… రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఆరోపణలు చేసుకుంటారు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మంచు విష్ణు సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా.. మంచు విష్ణు.. తన ప్యానల్ సభ్యులపై ఈరోజు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సినీ పరిశ్రమలో ఎన్నికలే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా యుద్దం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మంచు విష్ణు సైతం మీడియా సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మా ఎన్నికలకు తన కుటుంబాన్ని లాగొద్దని.. తన తండ్రి పేరును తీయొద్దని సూచించాడు. అలాగే.. ప్రకాష్ రాజ్‌కి బీపీ టాబ్లెట్ ఇవ్వాలని. ఆయన ఒక అపరిచితుడుగా మాట్లాడుతున్నాడని. నేరాలు గోరాలు జరుగుతున్నాయి అని ఆరోపిస్తున్నాడని మంచు విష్ణు అన్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు డ్రామాలు చేస్తున్నారని. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వొద్దు. పేపర్ బ్యాలెట్ కావాలి అని మా వాళ్ళు అంటున్నారని విష్ణు తెలిపారు. దానికోసం ఎన్నికల అధికారికి లెటర్ పెట్టాం. మేము గెలిచిన తరువాత మళ్ళీ టాంపేర్ చేశారు అని అన్నా అంటారు. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్ని సార్లు అయిన లెక్కబెట్టవొచ్చన్నారు.
అలాగే.. అక్టోబర్ 10 తర్వాత మళ్లీ అందరం ఒక్కటే అని.. తన కుటుంబం గురించి గానీ.. తన ప్యానల్ సభ్యుల గురించి గానీ తప్పుగా మాట్లాడవద్దని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను హెచ్చరించారు. అలాగే.. తన తండ్రి పేరును గానీ.. తన కుటుంబాన్ని కానీ.. ఎన్నికల్లోకి లాగొద్దని.. ఎందుకు తన తండ్రిపేరు పదే పదే వాడుతున్నారని.. తన తండ్రి మీడియా సమావేశాలు నిర్వహించి ఆరోపణలు చేయలేదని చెప్పుకొచ్చారు. మీ యాక్టింగ్ డ్రామా అంతా కెమెరా ముందు పెట్టండి. మీ యాక్టింగ్ ఇక్కడ అవసరం లేదు ప్రకాశ్ రాజ్ గారు అంటూ సెటైర్లు వేశారు. జీవిత గారు మీరు మా నాన్న గారి పేరు తీస్తే నేను తీస్తా. బజారు కు ఇడుస్తా అంటూ హెచ్చరించారు మంచు విష్ణు.
నేను కండియేట్ని అందర్నీ ఓటు అడిగే రైట్ నాకు ఉంది. పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా అందరిని అడిగాను. ఎవరైతే ఔట్ స్టేషన్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్‌కి వెళతాం అన్నవారికి నేను సహాయం చేసాను. ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక మెసేజ్ పెట్టారు 500 పోస్టల్ బ్యాలెట్ కోసం కట్టాలి అని. పోస్టల్ బ్యాలెట్ కోసం ఎవరైతే అప్లై చేశారో అందరూ నాకు కాల్ చేశారు. వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి మేము పెర్మిషన్ తీసుకొని కట్టాము. దాని తరువాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి 500 కి టైం ఇస్తా అన్నారు మేము మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. పెద్దలకు గౌరవం ఇవ్వాక పోతే ఎందుకు మనం ఉండి?. నడిగరం సంగంలో కూడా గొడవ పడ్డాడు. తమిళ ప్రొడ్యూసర్స్ ని అడగండి అసలు విషయం తెలుస్తుంది. పెద్దల పైన గౌరవం లేదు నేను వాళ్ళని షాసిస్తావా ?. విడదీయడానికి డ్రామా చేస్తున్నాడు ప్రకాష్ రాజ్.
జీవిత ఎలా గెలుస్తారు అని అంటున్నారు మమల్ని.. మాట్లాడితే అర్థం ఉండాలి. ఓట్లు వేయొద్దు అని రావొద్దు అని ఎలా చెప్తారు జీవిత. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ వొచ్చి మా నాన్న గారిని కలిశారు. ఎం మాట్లాడారు..మీరే చెప్పాలి. ప్రకాష్ రాజ్ మీకు దమ్ముంటే నా పేరు తియండి మాగాడు అయితే నా ఫామిలీ గురించి మాట్లాడొద్దు. నాకోసం నా కుటుంబం ఓటు గురించి అడుగుతారు అందులో తప్పేముంది. నా ఫామిలీ గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం గురించి తీస్తే బాగుండదు. నోరు జారితే 10వ తేదీ తరువాత మనం మొహం చూస్కోలేము. ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎజెండా ఇక్కడ చూపించకుండా ఉంటే మంచిది. నేను మీ కుటుంబం గురించి మాట్లాడను. శ్రీహరి ఉండి ఉంటే మీకు సరైన సమాధానం చెప్పేవారు. మా నాన్నా కళ్ళు మీరు టచ్ చేయలేదా? నాకు మా నాన్న సపోర్ట్ ఉంది. అందరూ సపోర్ట్ చేస్తున్నారని భయపడ్తున్నారు. చివరి వార్నిగ్గా చెప్తున్న మీరు చేసే ఆరోపణలు మాట్లాడే మాటలు 10వ తేదీ తరువాత బాగుండదు అంటూ సీరియస్ అయ్యారు మంచు విష్ణు.