AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Arrest: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి… కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..

Aryan Khan Arrest: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తీసుకునే ఉంది. తాజాగా..

Aryan Khan Arrest: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి... కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..
Aryan Khan
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 05, 2021 | 7:15 PM

Share

Aryan Khan Arrest: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తీసుకునే ఉంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ అరెస్ట్ తో బీ టౌన్ లో డ్రగ్స్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. షారుక్ ఖాన్ తనయుడు క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో పాల్గొనడంతో ఆర్యన్ తో పాటు మరో ఏడుగురిని న్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్ట్ మెమో ప్రకారం. వీరి నుంచి అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు సీజ్ చేశారు.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ నేరారోపణ రుజువైతే అతనికి కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్టయిన వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 8(సీ), 20 (బీ), 27 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 35లు నమోదు చేసింది. ఈ కేసులో  దోషులుగా తేలితే ఆయా సెక్షన్ల వల్ల శిక్ష, జరిమానా ఇలా…

సెక్షన్‌8(సీ): ఈ సెక్షన్ ప్రకారం ఎవరు ఏ విధమైనటువంటి మాదకద్రవ్యాలను ఎగుమతి దిగుమతి చేయకూడదు. మాదక ద్రవ్యాలను ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, కలిగి ఉండడం, విదేశాల నుంచి ఎగుమతి, దిగుమతి, సరఫరా వంటివి చేయకూడదు.

సెక్షన్‌ 20 (బీ): గంజాయి ఉల్లంఘనకు సంబంధించిన కేసు ఈ కేసులో తక్కువస్థాయిలో మాదకద్రవ్యాలు దొరికితే ఏడాది కాలం పాటు జైలు శిక్ష 10 వేల జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అదే ఎక్కువ మొత్తంలో దొరికితే 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ వాణిజ్యపరమైన మొత్తంలో దొరికితే.. పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా విధించొచ్చు.

సెక్షన్‌ 27: కొకైన్, మార్ఫైన్, డయాసైటైల్మోర్ఫిన్, ఇతర నార్కొటిక్‌ డ్రగ్, సైకోట్రోపిక్‌ వినియోగించినట్లయితే ఏడాది పాటు కఠిన కారాగారం, 20 వేల జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఒకొక్కసారి జరిమానా, జైలు శిక్ష రెండూ విధించొచ్చు. బి). తక్కువ మొత్తంలో అయితే 6 నెలల జైలు, రూ.10 వేల జరిమానా లేదా రెండు విధిం చొచ్చు. దాడిలో దొరికిన నిషేధిత డ్రగ్‌ పరిమాణాన్ని బట్టి సెక్షన్‌ 20 కింద శిక్ష ఉంటుంది. వాణిజ్యపరంగా డ్రగ్స్‌ కలిగి ఉంటే ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేకుండా బెయిలు రావడం కుదరదు. మరి ఇందులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఏ సెక్షన్ కింద నిరూపణ అయితాడు ఏ విధమైనటువంటి శిక్ష పడుతుందో తెలియాల్సి ఉంది.

Also Read:   ఓ వైపు భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ.. మరోవైపు తైవాన్ ఎయిర్ స్పేస్‌లో చైనా యుద్ధ విమానాలు..

 బాలీవుడ్ కు సింహ స్వప్నం సమీర్ వాంఖేడే.. ఎవరు.. ఎంతమంది సెలబ్రిటీలతో టాక్స్ కట్టించారంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..