China Military: ఓ వైపు భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ.. మరోవైపు తైవాన్ ఎయిర్ స్పేస్‌లో చైనా యుద్ధ విమానాలు..

China Military Planes: డ్రాగన్ కంట్రీ తన దేశ విస్తరణ కాంక్షను మరింత తీవ్ర తరం చేసింది. స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం..

China Military: ఓ వైపు భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ.. మరోవైపు తైవాన్ ఎయిర్ స్పేస్‌లో చైనా యుద్ధ విమానాలు..
China Military
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2021 | 5:09 PM

China Military Planes: డ్రాగన్ కంట్రీ తన దేశ విస్తరణ కాంక్షను మరింత తీవ్ర తరం చేసింది. స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించి..  తన దారికి తెచ్చుకోడానికి చైనా దూకుడును మరింత పెంచింది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి భారీగా యుద్ధ విమానాలను పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. శుక్ర, శనివారాల్లో మొత్తం 77 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టగా, ఆదివారం 16 విమానాలను చైనా పంపింది. తాజాగా మరో 56 యుద్ధ విమానాలు తమ గగనతలంలో చక్కర్లు కొట్టినట్టు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. తైవాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని..  చైనా చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పణంగా పెడుతున్నాయని ఆదేశ ప్రధాన మంత్రి సు సెంగ్-చాంగ్ అన్నారు. తైవాన్ ప్రీమియర్ సు త్సెంగ్-చాంగ్ చైనా విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించడాన్ని ఖండించారు. ప్రాంతీయ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు చైనా నిరంతరం క్రూరమైన, ఆటవిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇదే విషయంపై తాయ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 1 న చైనా తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నప్పటి నుండి తైవాన్ లోని దక్షిణ, నైరుతి వాయు రక్షణ జోన్ భాగంలో 148 చైనీస్ వైమానిక విమానాలు ప్రవేశించాయని చెప్పారు. చైనా చేస్తున్న పనుల వలన ఆసియాలో శాంతికి భంగం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నాయని ఆందోళలన వ్యక్తం చేశారు.  తైవాన్ ఏ దేశంతోనూ ఘర్షణను కోరుకోదని.. అయితే తమ ప్రజాస్వామ్యం,  జీవన విధానానికి ముప్పు వాటిల్లితే..  తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేస్తుందని ఆమె చెప్పారు.

ఇదిలావుండగా, దాదాపు ఓ సంవత్సరం నుంచి చైనా తరచూ తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తోంది. తైవాన్ ని ఆక్రమించుకోవడమో లేదా యుద్ధం పేరుతో ఉత్పత్తిని దెబ్బ తీయడమో చేయాలి అని చైనా ప్లాన్. ఒక వేళ యుద్ధం అంటూ చేస్తే చైనా మొదటి టార్గెట్ తైపే లోని సెమీ కండక్టర్ ఫౌండ్రీ లే ఉంటాయి. అయితే చైనా అంత దుస్సాసం చేస్తుందా అన్నదే ప్రశ్న.  చైనా చేస్తున్న పనులను స్వయంపాలిత దీవి  తైవాన్ తీవ్రంగా ఖండించింది. అయితే తైవాన్ తమదేనని చైనా చెప్తోంది. 1949లో జరిగిన అంతర్యుద్ధం నేపథ్యంలో చైనా, తైవాన్ విడిపోయాయి. మెయిన్ లాండ్ చైనాను కమ్యూనిస్టులు, తైవాన్‌ను నేషనలిస్టులు పరిపాలిస్తున్నారు.

ఇక మరో వైపు తూర్పు లడాక్ దగ్గర చైనా మళ్ళీ మిలటరీ డ్రిల్స్ ని వేగంగా చేస్తున్నది. ఇది వరకు చేసుకున్న ఒప్పందం ని కాదని మళ్ళీ భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తున్నది.  ఇతర దేశాలను రెచ్చగొట్టడం లేదా హెచ్చరించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేస్తున్నది చైనా.

Also Read:  బాలీవుడ్ కు సింహ స్వప్నం సమీర్ వాంఖేడే.. ఎవరు.. ఎంతమంది సెలబ్రిటీలతో టాక్స్ కట్టించారంటే..