Crime News: ఆడుకుందామని ఆడపడుచుని పిలిచిన వదిన.. కళ్లకు గంతలు కట్టి.. చివరికి..

ద్వేషం, అసూయ లేకుంటే మనిషి ప్రశాతంగా జీవిస్తాడు. ఇవి ఉంటే నిత్యం లోలోపల రగిలిపోతుంటాడు. ఈ ఈర్ష్య, అసూయ, పగ ఆవహిస్తే మనిషి ఏ స్థాయికైనా దిగజారుతాడు...

Crime News: ఆడుకుందామని ఆడపడుచుని పిలిచిన వదిన.. కళ్లకు గంతలు కట్టి.. చివరికి..
Crime News
Follow us

|

Updated on: Oct 05, 2021 | 5:58 PM

ద్వేషం, అసూయ లేకుంటే మనిషి ప్రశాతంగా జీవిస్తాడు. ఇవి ఉంటే నిత్యం లోలోపల రగిలిపోతుంటాడు. ఈ ఈర్ష్య, అసూయ, పగ ఆవహిస్తే మనిషి ఏ స్థాయికైనా దిగజారుతాడు. అలా దిగజారి నేరాలు చేస్తుంటాడు. ఇలానే ఓ వదిన తన ఆడపడుచును చంపేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‎లోని మందసౌర్‌లోని వ్యాస్ కాలనీలో ఉంటున్నసురేష్ శ్రోత్రియ్, రష్మిలకు సోషల్ మీడియాలో పరిచయమయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రష్మి స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్. సురేష్, రష్మి వివాహం చేసుకున్న తరువాత నుంచి రష్మి అత్తరింటికి అంటే మందసౌర్‎కు వచ్చారు. అక్కడ భర్త, అత్తమామ, ఆడపడుచుతో ఉంటున్నారు.

అయితే ఉన్నట్టుండి సురేష్ శ్రోత్రియ్ చెల్లి హర్షిత శ్రోత్రియ్ హత్యకు గురైంది. హత్య ఎవరు చేశారో తెలియక ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. హర్షితను వదిన రష్మి హత్య చేసినట్లు పోలీసులకు తెలిసింది. తన భర్తకు ప్రతీ విషయాన్ని అతని చెల్లెలు షర్షిత చెప్పడాన్ని రష్మి జీర్ణించుకోలేకపోయిందని అందుకే ఈ హత్య చేసినట్లు తెలిపారు. దీంతో పోలీసులు రష్మిని, ఆమె భర్త సురేష్ శ్రోత్రియ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగింది..?

చిన్న చిన్న కారణాలకు హర్షిత శ్రోత్రియ్‎తో రష్మి గొడవ పడుతుండేది. ఈ విషయాలన్ని హర్షిత శ్రోత్రియ్ అన్నయ్య సురేష్‎కు చెబుతుండేది. ఈ కారణంగా రష్మి, సురేష్ మధ్య గొడవలు జరుగుతుందేవి. దీంతో ఆడపడుచు హర్షితపై రష్మి పగ పెంచుకుంది. ఒక రోజు కళ్లకు గంతలు ఆట ఆడుదామని హర్షితను పిలిచిన రష్మి ఆమె కళ్లకు గంతలు కట్టింది. తరువాత కత్తితో హర్షితపై దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన హర్షితను ఇంటికి సమీపంలో ఉన్న బావిలోకి తోసి, దానిపై మూతవేసి అక్కడి నుంచి చల్లగా జారుకుంది. అక్టోబరు 2న హర్షిత మృతదేహం వారి ఇంటికి సమీపంలోని ఒక బావిలో కనిపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా వదినే అంతకురాలిగా గుర్తించారు.

Read Also.. Hyderabad: గత నెల 25న నాలాలో గల్లంతైన వ్యక్తి.. 11 రోజుల తర్వాత దొరికిన మృతదేహం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!