Viral Video: ‘టచ్ ఇట్’ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన ఎయిర్‌హోస్టెస్… యూత్‌తో పాటు బాలీవుడ్ కూడా ఫిదా..
Viral Video: సర్వసాధారణంగా ఎయిర్ హోస్టెస్ అంటే అందాల బొమ్మలు అని అందరి ఫీలింగ్. మరి ఈ అందాల బొమ్మ బుట్టబొమ్మలా డ్యాన్స్ చేస్తే..
Viral Video: సర్వసాధారణంగా ఎయిర్ హోస్టెస్ అంటే అందాల బొమ్మలు అని అందరి ఫీలింగ్. మరి ఈ అందాల బొమ్మ బుట్టబొమ్మలా డ్యాన్స్ చేస్తే.. ఎవరైనా కళ్ళు తిప్పుకోకుండా చూడడం ఖాయం. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ ఒక్క డ్యాన్స్ వీడియో క్లిప్ తో యువతని ఆకట్టుకుంది. టచ్ ఇట్ అనే సాంగ్ కి వేసిన స్టెప్స్ కు యూత్ ఫిదా.. విమానంలో ఎవరూ లేని సమయంలో ఎయిర్ హోస్టెస్ వేసిన స్టెప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. మనికే మాగే హితేకి పోటీగా దుమ్మురేపుతోంది. మనికే సాంగ్ స్లో సాంగ్.. అయితే టచ్ ఇట్ ఫాస్ట్ బీట్ కావడంతో… యూత్‌కి వెంటనే కనెక్ట్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ లోని ఏవియేషన్ లైఫ్స్ అకౌంట్‌లో షేర్ చేసిన టచ్ ఇట్ సాంగ్ డ్యాన్స్ వీడియో సామాన్యులనే కాదు.. బాలీవుడ్ సెలబ్రెటీలను సైతం అలరిస్తుంది. మాధురీ దీక్షిత్‌కి డూప్లికేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ టచ్ ఇట్ సాంగ్ బిట్ బీట్ వినగానే నెట్టింట్లో యువత ఊగిపోతున్నారు. చిన్న బిట్ కే ఓ రెంజ్ లో క్రేజ్ వచ్చేసింది. తక్కువ సమయంలోనే 5.5 లక్షలకు పైగా వ్యూస్ ను 59వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్న ఆ వీడియో మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
View this post on Instagram
Also Read: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి… కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..