Breast Cancer Month 2021: హ్యాట్సాఫ్! రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకుని.. తనలాంటి వారి కోసం యాప్ సిద్ధం చేసిన వనిత..

మహిళలను ఎక్కువ ఇబ్బందికి గురిచేసే వ్యాధి రొమ్ము క్యాన్సర్(బ్రెస్ట్ క్యాన్సర్). దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారూ ఎక్కువే.

Breast Cancer Month 2021: హ్యాట్సాఫ్! రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకుని.. తనలాంటి వారి కోసం యాప్ సిద్ధం చేసిన వనిత..
Breast Cancer Awareness Month 2021
Follow us
KVD Varma

|

Updated on: Oct 05, 2021 | 7:19 PM

Breast Cancer Month 2021: మహిళలను ఎక్కువ ఇబ్బందికి గురిచేసే వ్యాధి రొమ్ము క్యాన్సర్(బ్రెస్ట్ క్యాన్సర్). దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారూ ఎక్కువే. ఈ రొమ్ము క్యాన్సర్ పై ఇప్పటికీ మహిళల్లో సరైన అవగాహన లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ నేలను రొమ్ము క్యాన్సర్ అవగాహనా నెలగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ ను ఓడించి.. ఈ వ్యాధి బారిన పడిన మహిళలకోసం యాప్ ను రూపొందించిన ఒక మహిళ గురించి.. ఆమె అభివృద్ధి చేసిన యాప్ గురించి తెల్సుకుందాం.

రొమ్ము క్యాన్సర్‌ని ఓడించిన 36 ఏళ్ల జెస్సికా బల్దాద్, ఈ వ్యాధితో పోరాడుతున్న మహిళలకు సహాయం చేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడే యాప్‌ని జెస్సికా అభివృద్ధి చేసింది. జెస్సికా యాప్ పేరు ‘ఫీల్ ఫర్ యువర్ లైఫ్’. ఇది రొమ్ము క్యాన్సర్ స్థితిని ట్రాక్ చేస్తుంది. నోటిఫికేషన్‌లను పంపడం ద్వారా అవసరమైన పరీక్షలు అలాగే, జాగ్రత్తల గురించి మహిళలకు తెలియజేయడానికి ఈ యాప్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్. మహిళల్లో మరణానికి ఇది రెండవ ప్రధాన కారణం.

జెస్సికా కథ ఇదీ..

తన గురించి జెస్సికా ఇలా చెబుతోంది.. ”నేను కాలేజీలో ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ శరీరంలో మొదలైంది. నేను స్పృహలో ఉన్నాను. రొమ్మును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను నా రొమ్ములో ఒక ముద్ద ఉన్నట్టు అనుభూతి చెందాను. అయితే, ఆ గడ్డ క్యాన్సర్ కాదు. వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్సతీసుకోవడం ప్రారంభించాను. ఈ క్రమంలో నాకు శస్త్రచికిత్స జరిగింది. ఆ గడ్డ తొలగించారు.

ఈ సంఘటన తరువాత, నేను అప్రమత్తమయ్యాను. రొమ్మును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ఆపలేదు. కొంత సమయం తరువాత, గడ్డ మళ్లీ కనిపించింది. ఈసారి ముద్దను పరీక్షించడంలో క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కానీ, డాక్టర్ నాకు నేరుగా ఏమీ చెప్పలేదు. అప్పుడు నేను మరొక వైద్యుడిని కలిశాను. అనేక రౌండ్ల అల్ట్రాసౌండ్ పరీక్షల తర్వాత, అతను నాకు క్యాన్సర్ ఉందని చెప్పాడు.

ముందు నేను చాలా భయపడ్డాను. రొమ్ము క్యాన్సర్‌ కారణంగా.. మరణించిన అత్త అంత్యక్రియలకు కూడా నేను హాజరుకాలేదు. తరువాత రొమ్ము క్యాన్సర్ కు చికిత్స ప్రారంభించారు. చికిత్స సమయంలో 16 రౌండ్ల కీమోథెరపీ చేశారు. రెండుసార్లు మాస్టెక్టమీ చేయించుకున్నాను. రేడియేషన్ మొత్తం 25 గంటలు గడిచింది. ఇటీవల ఫ్లాప్ పునర్నిర్మాణ శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స సమయంలో, దెబ్బతిన్న రొమ్ము కొవ్వు కణజాలాన్ని.. పొత్తికడుపు నుండి తీసుకున్న రక్త నాళాల సహాయంతో తిరిగి ఆకృతి కల్పించారు. జెస్సికా మహిళలకు సహాయం చేయడం..

ఆమె ప్రొఫెషనల్ యాప్ డెవలపర్ కాదు. కానీ ప్రజలకు సహాయం చేయడం ఆమె అభిరుచి. తన పరీక్ష నుండి పాఠాలు నేర్చుకుని, ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ యాప్‌ను అభివృద్ధి చేసింది. జెస్సికా ఇలా చెప్పింది. ”ఇప్పుడు నేను ఆ మహిళలకు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తున్నాను. దీనితో పాటుగా, నేను వారికి క్యాన్సర్‌ని నిర్ధారించడానికి.. దానికి చికిత్స తీసుకోవడానికి సహాయం చేస్తున్నాను.” అదేవిధంగా తాను, మహిళలు తమ రొమ్ము ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించాలని.. సంకోచాన్ని తొలగించుకోవాలని కోరుక్కున్తున్నట్టు చెప్పింది.

10 సంవత్సరాలలో దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు 30% పెరిగాయి

గత 10 సంవత్సరాలలో దేశంలో క్యాన్సర్ కేసులు 30 శాతం పెరిగాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. అయినప్పటికీ, దేశంలో 80 శాతం మంది మహిళలు క్యాన్సర్ మూడో లేదా నాల్గవ దశలో కానీ, డాక్టర్ల వద్దక వెళ్ళడం లేదు.

రొమ్ము క్యాన్సర్ యొక్క 4 దశలను తెలుసుకుందాం..

దశ 0: ఇది క్యాన్సర్‌కు ముందు పరిస్థితి. రొమ్ము నాళాలలో క్యాన్సర్ కణాలు నివసిస్తాయి. పరిసర కణజాలాలకు చేరదు. అంటే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

దశ 1: కణితి పరిమాణం 2 సెం.మీ కంటే ఎక్కువ కాదు. శోషరస కణుపులు ప్రభావితం కావు.

దశ 2: కణితి పరిమాణం 2 సెం.మీ కంటే చిన్నది, కానీ క్యాన్సర్ శోషరస కణుపులకు వ్యాపించింది. కణితి పరిమాణం కూడా 2-5 సెంటీమీటర్లకు వ్యాపిస్తుంది.

దశ 3: ఈ స్థితిలో కణితి పరిమాణం 5 సెం.మీ కంటే ఎక్కువ కాదు. కానీ, అది చుట్టుపక్కల కణజాలాలకు వ్యాపించింది. క్యాన్సర్ ఛాతీ లేదా చర్మానికి కూడా వ్యాపిస్తుంది.

దశ 4: కణితి ఏ పరిమాణంలోనైనా ఉండవచ్చు. ఇది శోషరస కణుపులకు వ్యాపించింది. శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ రావడానికి శోషరస గ్రంథులు మార్గం.

ఇవి కూడా చదవండి:

Shut Down Mystery: ఏడు గంటల షట్‌డౌన్‌.. ఎవరున్నారు.. ఏం చేశారు.. అదే నిజమా.. వివాదం వెనుక రహస్యం..

Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు నోబెల్ బహుమతి.. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లకు పురస్కారం