Knee Pain-Home Tips: కీళ్లు, మోకాళ్ళు, వెన్నె నొప్పితో బాధపడుతున్నారా 15 రోజులు ఈ టీ తాగిచూడండి.. రిలీఫ్ పొందండి

Knee Pain-Home Remedy: ప్రస్తుతం కొన్ని వ్యాధులకు వయసుతో పనిలేదు.. మారిన ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీక శ్రమ, ఏసీల వాడకం, వాతావరణ..

Knee Pain-Home Tips: కీళ్లు, మోకాళ్ళు, వెన్నె నొప్పితో బాధపడుతున్నారా 15 రోజులు ఈ టీ తాగిచూడండి.. రిలీఫ్ పొందండి
Knee Pain
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2021 | 4:16 PM

Knee, Joint Pains-Home Remedy: ప్రస్తుతం కొన్ని వ్యాధులకు వయసుతో పనిలేదు.. మారిన ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీక శ్రమ, ఏసీల వాడకం, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో చిన్నతనంలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్, వాత నొప్పులు, ఎముకల జాయింట్స్ వద్ద జిగురు అరిగిపోవడం. ఖాళీలు రావడం వంటి రోగాల బారిన పడుతున్నారు. అయితే ఇవి ఒక్కసారి వస్తే తగ్గవని.. కనుక నొప్పులు వచ్చినప్పుడు తగ్గడానికి మెడిసిన్స్ వాడుతూ.. రిలీఫ్ ను పొందుతున్నారు.

ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టానికి ఆయుర్వేద చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్ గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు వాతం నొప్పులు ఎంతగా తగ్గుతాయో తెలుస్తోంది. మీరే మళ్ళీ పదిమందికి ఈ చిట్కా గురించి చెప్పడం ఖాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం..

50 గ్రాములు సొంటి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి. అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. అయితే  షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకూడదు. ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో అద్భుత ఫలితం ఉంటుంది. వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది.

శొంఠి, మెంతులు, వాము వాతం, కఫాన్ని తగ్గిస్తాయి. జాయింట్స్ లో జిగురును ఇస్తాయి. జీర్ణక్రియ మెరుగు పరుస్తాయి. వాము తిన్న ఆహారంలో ఖనిజాలు, లవణాలు శరీరానికి అందేలా చేస్తాయి. కీళ్ల నొప్పులు,  వెన్ను నొప్పి, జాయింట్ట్స్ లో  గ్రీసు, ఖాళీలు వంటివి తగ్గుతాయి. వాపులు కూడా తగ్గుతాయి. అయితే ఈ టీ తాగే 15 రోజులూ చల్లని పదార్ధాలు తీసుకోకూడదు. కారం, మసాలా ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది.

శొంఠి, మెంతులు, వాము..  వాతం, కఫాన్ని తగ్గిస్తాయి. జాయింట్స్ లో జిగురును వచ్చేలా చేస్తాయి. జీర్ణక్రియ మెరుగు పరుస్తాయి. ఖనిజాలు, లవణాలు శరీరానికి అందేలా చేస్తాయి. ఇక బెల్లం వలన ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది.  నీరసం, అలసట దరిచేరవు.

కాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.  బయట ఆహారం తినకపోవడమే మంచిది. రాత్రి 7గంటలలోపు తినడం అలవాటు చేసుకోవాలి. తినడం మాత్రం మానకూడదు. సాయంత్రం 5గంటల తర్వాత చల్లని పదార్దాలు తీసుకోకూడదు.  ఇలా చేసినట్లయితే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ నొప్పి, వెన్నులో నొప్పి తగ్గుతాయి.

Also Read:  కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్.. రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..