Control Bad Habits: చెడు వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నారా.? అయితే ఇలా చేయండి.. తాజా అధ్యయనంలో..
Control Bad Habits: మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలు ఆరోగ్యానికి హానికరమనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ అలవాట్లు ఆరోగ్యానికి హనిచేస్తాయని తెలిసినా చాలా మంది వాటిని...
Control Bad Habits: మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలు ఆరోగ్యానికి హానికరమనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ అలవాట్లు ఆరోగ్యానికి హనిచేస్తాయని తెలిసినా చాలా మంది వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆ అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో విఫలమవుతుంటారు. ఎంత నిగ్రహంగా ఉన్నా ఏదో ఒక సమయంలో మళ్లీ చెడు అలవాట్లకు మనసు లాగుతుంటుంది.
అయితే ఇలాంటి వ్యసనాల నుంచి బయటపడాలంటే ఓ పని చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మద్యపానం, ధూమపానంతో పాటు జంక్ ఫుడ్ అలవాటు ఉన్న వారు కూడా వీటికి దూరం కావాలంటే పచ్చని చెట్లతో కూడిన వాతావరణంలో గడపాలని చెబుతున్నారు. ఇలా పచ్చని వాతారణంలో నిత్యం గడిపితే క్రమేణా.. ఆ అలవాట్ల నుంచి వారు శాశ్వతంగా విముక్తి పొందవచ్చని శాస్త్రవేత్తలు చేపిట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. నేచురల్ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ కార్వింగ్: ది మెడియేటింగ్ రోల్ ఆఫ్ నెగెటివ్ అఫెక్ట్.. అనే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు ఈ వివరాలను వెల్లడించారు. పచ్చని చెట్లతో కూడిన వాతవరణంలో నిత్యం గడిపితే.. చెడు అలవాట్లకు ఆకర్షితులు కారని పరిశోధకులు చెబుతున్నారు. మరి మీరూ కూడా ఇలాంటి వ్యసనాలతో బాధపడుతున్నారా? అయితే రోజులో కొంత సమయం పచ్చని చెట్ల మధ్య గడపండి.
Also Read: Mamata Banerjee: మమత పోటీ చేసేది అక్కడ్నించే.. తృణమూల్ సీటు నుంచే బరిలోకి దీదీ
Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు