Smoking: పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్‌.. స్మోకింగ్‌ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం.

Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా పొగరాయుళ్లు మాత్రం మానడానికి ఇష్టపడరు. ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిసినా అలవాటును మాత్రం..

Smoking: పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్‌.. స్మోకింగ్‌ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం.
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 24, 2022 | 8:00 AM

Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా పొగరాయుళ్లు మాత్రం మానడానికి ఇష్టపడరు. ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిసినా అలవాటును మాత్రం మానుకోలేరు. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలిసినవి ఇవే అయితే తాజా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పొగతాగడం ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ నెవెడా, లాస్‌వెగాస్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దీర్ఘకాలంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో ఎముకలు గుల్లబారటం, విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా కొంత మందిని పరిగణలోకి తీసుకొని, వారి ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం చేసే వారిలో ఎముకలు బలహీనంగా మారే అవకాశాలు 37 శాతం ఎక్కువని పరిశోధనల్లో తేలింది.

మణికట్టు, కాళ్లు, వెన్నెముక, భుజాలు లాంటి భాగాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎముకలు విరిగిన వారిలో 21 నుంచి 37 శాతం మంది ఏడాదిలోపే మరణించినట్లు పరిశోధనల్లో తేలింది. టొబాకోలోని కొన్ని రసాయనాలు ఎముకల కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్‌ డీ శరీరానికి అందకుండా చూసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!