AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ యమ్మీ యమ్మీ సూపర్ సూప్ ట్రై చేయండి..

మనలో చాలా మందికి బరువు తగ్గడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అని మనకు తెలుసు. ఇలాంటి సమస్యకు ఈజీగా చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త దారులను..

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ యమ్మీ యమ్మీ సూపర్ సూప్ ట్రై చేయండి..
Pumpkin Soup
Sanjay Kasula
|

Updated on: Jan 19, 2022 | 6:49 AM

Share

Pumpkin Health Benefits: మనలో చాలా మందికి బరువు తగ్గడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అని మనకు తెలుసు. ఇలాంటి సమస్యకు ఈజీగా చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త దారులను వెతుకుతున్నాం. ఇందులో భాగంగా వివిధ బరువు తగ్గించే ఆహారాలు, బరువు తగ్గడానికి అనుకూలమైన వంటకాలు, డిటాక్స్ పానీయాలను ప్రయత్నిస్తాము.. కానీ కొన్నిసార్లు ఇది సరిపోవడం లేదు. మన లక్ష్యాలను సాధించినప్పటికీ.. మన బరువును కాపాడుకోవడం.. ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం కూడా ముఖ్యమైన పనే.. ఆహారం తీసుకోకుండా ఆరోగ్యం అనేది ఓ పిచ్చి పని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి బరువును తగ్గించడంలో సహాయం పడుతుంది. వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం. కాబట్టి, మీరు రుచి విషయంలో రాజీపడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఇక్కడ మనం రుచికరమైన గుమ్మడికాయ సూప్‌ని అందిస్తున్నాము. దానిని మీరు మీ హెల్త్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

శీతాకాలం వచ్చిందంటే చాలు స్థానిక మార్కెట్‌లో గుమ్మడికాయలను సులభంగా లభిస్తాయి. చట్నీ, సబ్జీలు, టిక్కీలు, మరెన్నో రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి మనం ఉపయోగించే  ఆహారాలలో ఇది ఒకటి. ఇక్కడ ఒక గుమ్మడికాయ వంటకం ఉంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది .

గుమ్మడికాయ సూప్ 5 ఆరోగ్య ప్రయోజనాలు:

  1. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఫైబర్ చాలా అవసరం. ఇది బరువు తగ్గడానికి..ఆకలి బాధలను తగ్గించడానికి సహాయ పడుతుంది . USDA ప్రకారం, 100-గ్రాముల గుమ్మడికాయలో 0.5 mg ఫైబర్ మాత్రమే ఉంటుంది. ఫలితంగా ప్రతి కప్పు గుమ్మడికాయ సుమారుగా 3 mg ఫైబర్‌ను అందిస్తుంది.
  2.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యమైన విటమిన్లు సి, బీటా కెరోటిన్ కలిగి ఉన్నందున గుమ్మడికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. త్వరగా.. సురక్షితంగా బరువు తగ్గడానికి బలమైన, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యం.
  3. చర్మాన్ని మెరుగుపరుస్తుందిగుమ్మడికాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది లోపలి నుండి చర్మానికి పోషణనిస్తుంది. మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.
  4.  తక్కువ కేలరీలుUSDA డేటా ప్రకారం.. 100-gm పచ్చి గుమ్మడికాయ కేవలం 26 కేలరీలను మాత్రమే అందిస్తుంది. కాబట్టి, మీరు మీ ఆహారాన్ని ఎలా తయారు చేస్తారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మీరు తక్కువ మొత్తంలో కేలరీలలో చాలా పోషకాలను పొందవచ్చు.
  5.  మంచి పోస్ట్-వర్క్ అవుట్ భోజనం గుమ్మడికాయ సూప్. ఒక అద్భుతమైన పోస్ట్-వర్కౌట్ భోజనం.. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. 100-గ్రాముల గుమ్మడికాయ 340 మిల్లీగ్రాముల పొటాషియంను అందిస్తుంది. ఇది అరటిపండ్ల కంటే ఎక్కువ. కాబట్టి, ఈ ప్రయోజనాలతో పాటు మీ ఆహారంలో గుమ్మడికాయ సూప్‌ను జోడించడం తప్పనిసరి!

ఇవి కూడా చదవండి: కాకి తలపై తన్నిందా.. బయటికి వెళ్లేముందు పిల్లి ఎదురైందా.. శకున శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Coronavirus: హిమాలయాల్లో అపర సంజీవని.. కరోనాను కట్టడి చేసే మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు!