Coronavirus: హిమాలయాల్లో అపర సంజీవని.. కరోనాను కట్టడి చేసే మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు!

కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని దడ పుట్టిస్తున్న వేళ.. హిమాలయాల నుంచి గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.

Coronavirus: హిమాలయాల్లో అపర సంజీవని.. కరోనాను కట్టడి చేసే మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు!
Himalayan Flower
Follow us

|

Updated on: Jan 18, 2022 | 9:40 PM

ఏదైతే.. మళ్లీ వినకూడదనుకున్నామో… ఏదైతే మళ్లీ చూడకూడదని అనుకున్నామో… మళ్లీ అదే జరుగుతోంది…! కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కాస్త కూల్‌గా ఉందనుకున్న సమయంలో.. వరల్డ్‌ వైడ్‌గా మళ్లీ హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. తన రూపాన్ని మారుస్తోంది మహమ్మారి. కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ.. ప్రపంచాన్ని దడ పుట్టిస్తున్న వేళ.. హిమాలయాల నుంచి గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. హిమాలయాల్లో ఆ అపర సంజీవని ఏంటో మీరే చదవండి.

2020లో కరోనా కాటుకు ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోయాయి. మన దేశం కూడా దారుణ పరిస్థితులు ఎదుర్కొంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో.. తెలియని పరిస్థితుల్లో.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆంక్షలను గాలికి వదిలేసి.. నిబంధనలకు నీళ్లు వదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పాపానికి.. తగిన మూల్యం చెల్లించుకున్నాం. కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర ప్రాణనష్టాన్ని చవిచూశాం.. కొద్ది నెలలుగా దేశంలో కాస్త కేసులు తగ్గి… కూల్‌గా ఉందనే లోపే.. మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. వరల్డ్‌ వైడ్‌గా సునామిలా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో… శాస్త్రవేత్తలు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.

హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని మరోసారి తేలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ను నిరోధించే… ఫైటోకెమికల్స్​ కలిగిన మొక్కను హిమాలయాల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. హిమాచల్​ప్రదేశ్​లోని మండీ ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ-ఐఐటీ, ఢిల్లీలోని ఇంటర్నేషనల్​ సెంటర్​ ఫర్​ జెనెటిక్​ ఇంజినీరింగ్​ అండ్​ బయో టెక్నాలజీ -ఐసీజీఈబీ సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించాయి. హిమాలయాల్లోని రోడోడెండ్రాన్​ అర్బోరియం అనే మొక్క పూరేకుల్లో కొవిడ్​-19 చికిత్సలో కీలకమైన… ఫైటోకెమికల్స్​ను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్​ గా పిలుస్తారు. ఈ ఫైటోకెమికల్స్​ వైరస్​కు వ్యతిరేకంగా పోరాడతాయని.. దీనిపై బయోమాలిక్యులార్​ స్ట్రక్చర్​ అండ్​ డైనమిక్స్​ జర్నల్​లో ఇటీవలే ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇప్పటికే.. ఈ మొక్క పూరేకుల‌ను స్థానికులు అనేక ఆయుర్వేద ఔష‌దాల్లో వినియోగిస్తున్నారు.

టీకాలు కాకుండా వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఇత‌ర ప‌ద్ద‌తుల‌పై ఇప్ప‌టికే అనేక మంది శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. మొక్క‌ల నుంచి ల‌భించే ఆయుర్వేద ఔష‌దాలు శ‌రీరంలోని క‌ణాల్లోకి ప్ర‌వేశించి వైర‌స్‌ను అడ్డుకుంటాయని, వైర‌స్‌ను అడ్డుకునే శ‌క్తిని శ‌రీరానికి క‌ల్పిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి హిమాల‌యాల్లో నివశించే స్థానికులు… ఈ బురాన్ష్‌ను… ఔష‌ద మూలిక‌ల్లో వినియోగిస్తున్నారు.. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి.. ఈ మొక్కతో కరోనాకు చెక్‌ పెట్టేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..