AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు
Ap Government
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2022 | 9:22 PM

Share

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు  ఉత్తర్వులు జారీ చేసింది.  సామాజిక భద్రత కల్పనా చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువస్థాయి హోదాతో నియామకం జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయాన్నే ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం వల్ల ఆలస్యమైందని ప్రభుత్వం తెలిపింది.  త్వరితగతిన ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు గానూ గ్రామవార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో మృతి చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులను కారుణ్య నియామకం కింద భర్తీ చేయాలని నిర్ణయించింది.  అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించి తక్షణం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వారితో భర్తీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: పెద్దల్ని ఎదిరించి యువతి కులాంతర వివాహం.. ఇప్పుడు 6 నెలల గర్భిణీ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త

ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి