AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: పెద్దల్ని ఎదిరించి యువతి కులాంతర వివాహం.. ఇప్పుడు 6 నెలల గర్భిణీ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త

ఒంగోలులో ప్రేమ పేరుతో మరో యువకుడు మోసానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి గుళ్ళో పెళ్లి చేసుకుని కాపురం చేసి భార్యకు ఆరోనెల రాగానే అబార్షన్‌ చేసుకోవాలి వేధిస్తున్నాడు.

AP: పెద్దల్ని ఎదిరించి యువతి కులాంతర వివాహం.. ఇప్పుడు 6 నెలల గర్భిణీ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త
Love Cheating
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2022 | 7:28 PM

Share

ఒంగోలులో ప్రేమ పేరుతో మరో యువకుడు మోసానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి గుళ్ళో పెళ్లి చేసుకుని కాపురం చేసి భార్యకు ఆరోనెల రాగానే అబార్షన్‌ చేసుకోవాలి వేధిస్తున్నాడు. తమది పెళ్ళేకాదని వాదిస్తున్నాడు. మరోపెళ్ళి చేసుకునేందుకు సిద్దపడి తనను వేధిస్తున్నాడంటూ ఒంగోలు దిశ పియస్‌లో గడ్డం నందిని అనే యువతి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి వేడుకుంటోంది.

19 ఏళ్ళ  గడ్డం నందిని… ఏడాది క్రితం విజ్ఞగిరి సాయి అనే యువకుడ్ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. కొండపిలో కూరగాయాల దుకాణం నడిపే యువతి తల్లిదండ్రులు వీరి పెళ్ళికి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి సాయిని సింగరాయకొండ దేవస్థానంలో పెళ్ళి చేసుకుంది. ఒంగోలులో కాపురం పెట్టారు.. ఏడాది కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. ప్రస్తుతం నందిని ఆరు నెలల గర్భిణీ. ఈ పరిస్థితుల్లో భర్త సాయి తన మరదలిని పెళ్ళి చేసుకునేందుకు పథకం వేసి ఇంటికి రావడం లేదని నందిని ఆరోపిస్తుంది. తనను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో యువతిని ఎలా పెళ్ళి చేసుకుంటావని సాయిని నిలదీసింది. దీంతో అతడు నువ్వు నాకు అక్కర్లేదని, అబార్షన్‌ చేయించుకోవాలని బలవంతం చేస్తున్నాడని నందిని ఒంగోలు దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో సాయి ప్రేమ, పెళ్ళి, మోసం వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. అయితే నందిని ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన యువతి కావడంతో దిశ పోలీసులు ఆమెను ఒంగోలు తాలూకా పియస్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. దీంతో యువతి నందిని తనకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ విలపిస్తోంది. ఒంగోలు తాలూకా పియస్‌లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..

స్పెషల్ సాంగ్ కు ‘ఊ’ అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Follow Us
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!