Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Covid Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో రోజువారీ కేసులు రెండున్న‌ర ల‌క్ష‌లు దాటేశాయి. అయితే క‌రోనాను అంతమొందించే ఏకైక అస్త్రం వ్యాక్సిన్ అనే విష‌యాన్ని....

Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2022 | 10:18 PM

Covid Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో రోజువారీ కేసులు రెండున్న‌ర ల‌క్ష‌లు దాటేశాయి. అయితే క‌రోనాను అంతమొందించే ఏకైక అస్త్రం వ్యాక్సిన్ అనే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ విష‌యాన్ని న‌మ్మిన ప్ర‌పంచ దేశాల‌న్నీ వ్యాక్సినేష‌న్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. వ్యాక్సినేష‌న్ విష‌యంలో ప్రారంభంలో కొన్ని అపోహ‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్రస్తుతం అవ‌న్నీ ప‌టాపంచ‌ల‌వుతున్నాయి. అంద‌రూ వ్యాక్సినేష‌న్ చేసుకుంటారు. అయితే ఇప్ప‌టికీ గ‌ర్భిణీల్లో కొన్ని అనుమానాలు అలానే ఉన్నాయి. గ‌ర్బిణీలు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది.? ఏ స‌మయంలో తీసుకోవాలి.? లాంటి విశేషాల‌ను పంచుకున్నారు నొయిడాలోని అపోలో ఆసుప‌త్రికి చెందిన గైన‌కాల‌జిస్ట్ మిథీ భానోట్‌.

గ‌ర్భిణీల‌కు వ్యాక్సినేష‌న్ విష‌య‌మై డాక్ట‌ర్ మాటల్లోనే.. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ర్భిణీల‌కు కేవ‌లం 2.78 కోట్ల డోసులు మాత్ర‌మే వ్యాక్సిన్ ఇచ్చారు. 1.59 కోట్ల మందికి మొద‌టి డోస్ ఇవ్వ‌గా 1.19 కోట్ల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకొని గ‌ర్భిణీలు వెంట‌నే తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే వారికి కూడా వ్యాక్సిన్ సోకే ప్ర‌మాదం పొంచి ఉంది. అయితే కొంద‌రు మ‌హిళ‌లు వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే జ్వ‌రం.. పుట్ట‌బోయే బిడ్డ‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే అపోహ‌లో ఉన్నారు. దీంతో వ్యాక్సినేష‌న్‌కు వెనుక‌డుగు వేస్తున్నారు. అయితే గ‌ర్భిణీలు టీకాలు తీసుకునే రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు అవ‌గాహ‌న క‌ల్పించాలని డాక్ట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏ స‌మ‌యంలో వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది..?

గ‌ర్భిణీలు ఏ స‌మ‌యంలో వ్యాక్సిన్ తీసుకోవాల‌నే విష‌యంపై ఇంకా ఎలాంటి అధ్య‌య‌నాలు లేక‌పోవ‌డంతో ఇదే స‌రైన స‌మ‌యమ‌ని చెప్ప‌డం క‌ష్టం. అయితే వ్యాక్సిన్‌కు మొద‌టి మూడు నెల‌లు దూరంగా ఉండాల‌ని కొంద‌రు సూచిస్తున్నారు. మొద‌టి ద‌శ‌లో పిండం ఇంకా అభివృద్ధి ద‌శ‌లోనే ఉంటుంది కాబ‌ట్టి గ‌ర్భిణీలు మూడు నెల‌ల త‌ర్వాత వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఉత్త‌మం.

ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి..?

గ‌ర్భిణీలు కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ల‌లో దేనిని తీసుకున్న ఇబ్బందులు ఎదురుకావు. కానీ గ‌తంలో శ‌రీరంలో రక్తం గ‌డ్డ క‌ట్ట‌డం లాంటి స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న వారు మాత్రం కోవాక్సిన్ తీసుకుంటే ఉత్త‌మం. ఇక గ‌ర్భిణీలు క‌చ్చితంగా క‌రోనా నిబంధ‌న‌లు తూచా త‌ప్ప‌కుండా పాటించాలి. మాస్కులు ధ‌రించ‌డం, చేతులు నిత్యం శుభ్రం చేసుకోవ‌డం చేస్తుండాలి.

అవ‌న్నీ అపోహ‌లే..

గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీస‌కుంటే దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయ‌నే అపోహ‌లు ఉన్నాయి కానీ వీటిలో ఏమాత్రం నిజం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే త‌ల్లులు కూడా ఎలాంటి భ‌యం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. త‌ల్లుల్లో త‌యార‌య్యే రోగ నిరోధ‌కాలు చిన్నారుల‌కు కూడా చేరుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

పాజిటివ్ వ‌స్తే గ‌ర్భం దాల్చ‌వ‌చ్చా..

కరోనా పాజిటివ్‌గా తేలిన త‌ర్వాత గ‌ర్భం దాల్చ‌వ‌చ్చా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి నిపుణులు నిస్సందేహంగా దాల్చ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. అయితే కోవిడ్ సోకి త‌గ్గిన త‌ర్వాత మూడు నెల‌లు గ్యాప్ తీసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. అదే గ‌ర్భం దాల్చిన వెంట‌నే వైర‌స్ సోకితే గ‌ర్భాన్ని కొన‌సాగించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచ‌న మేర‌కు సాధార‌ణ మందులు తీసుకుంటే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. మంచి పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే సుల‌భంగా స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

Also Read: Agriculture News: పంట మార్పిడి పాటిస్తే రైతుల ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.. ఎలాగంటే..?

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!