Monsoon Care: వర్షాకాలంలో ఈ ఆహారాలు తింటే జబ్బుల భయం ఉండదు..!
వర్షాకాలం రాగానే అనేక రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి. వీటి నుంచి కాపాడుకోవాలంటే మన శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఒకే పదార్థం తినడం సరిపోదు.. సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. మన వంటింట్లో ఉండే కొన్ని సాధారణ పదార్థాలు ఇమ్యూనిటీని బలపరుస్తాయి.

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలా రోగాలు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉండాలి. ఒకే ఒక్క ఫుడ్ తింటే మన ఆరోగ్యం బాగుపడదు. కానీ సరైన పద్ధతిలో పోషకాలు ఉన్న ఆహారం తింటే అది సాధ్యమే. మన వంటింట్లో రోజూ వాడే కొన్ని పదార్థాలు కూడా ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పవర్ ఫుల్ సమ్మేళనం ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. కర్రీలలో, సూప్ లో పసుపు వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
అల్లం
అల్లం వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో అల్లం టీ తాగడం లేదా అల్లం కలిపిన నీళ్లు తాగడం చాలా మంచిది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో కూడా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
పాలకూర
పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మునగ
మునగలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం బాగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ఇమ్యూనిటీని కూడా బలోపేతం చేస్తాయి.
చింతపండు
చింతపండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శరీరంలో వచ్చే వాపును తగ్గిస్తుంది. ఆహారంలో చింతపండు చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఫుడ్స్‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి సులభంగా కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




