Postpartum Hair Loss : డెలివరీ తర్వాత జుట్టు వేగంగా రాలిపోతుందా? అయితే ఇలా చేసి అంతమైన జుట్టును సొంతం చేసుకోండి..!
Postpartum Hair Loss : గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల గురించి మనందరికీ తెలిసిందే. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఈ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో చర్మం,
Postpartum Hair Loss : గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల గురించి మనందరికీ తెలిసిందే. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఈ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో చర్మం, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు స్త్రీలను వేధిస్తాయి. వేగంగా జుట్టు రాలడం కూడా ఇందులో భాగమే. చాలా మంది స్త్రీలు ప్రసవం తర్వాత ఈ సమస్యలు సులువుగా తగ్గిపోతాయని భావిస్తారు. కానీ డెలివరీ తర్వాత కూడా కొంత సమయం వరకు ఈ సమస్యలు ఉంటాయి. ప్రసవం తర్వాత కూడా స్త్రీలకు జుట్టు రాలడం ఆగిపోదు. దీన్నే ప్రసవానంతర జుట్టు రాలడం అంటారు. వాస్తవానికి డెలివరీ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా స్త్రీలలో జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. జుట్టు రాలిపోయే సమస్య దాదాపు 6 నుండి 8 నెలల వరకు ఉంటుంది. మీ జుట్టు కూడా వేగంగా రాలిపోతుంటే, ఈ సమస్యతో విసిగివేసారిపోతున్నట్లయితే.. కొన్ని ఇంటి నివారణ చర్యలు పాటిస్తే సరిపోతుంది. మరి నిపుణులు చెబుతున్న ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ: జుట్టు, చర్మానికి ఉసిరికాయ ఎంతగానో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరిని ఒక వరం అని వర్ణించబడింది. జుట్టు రాలిపోతున్నట్లయితే, పెరుగు, ఉసిరి, షికాకాయ్ పేస్ట్‌ను అప్లై చేయాలి.
పెరుగు: పెరుగు జుట్టుకు కండీషనర్‌గా పనిచేస్తుంది. అలాగే జుట్టు కురులను బలంగా చేస్తుంది. మీరు నేరుగా జుట్టుకు పెరుగును అప్లై చేయవచ్చు. పెరుగును అప్లై చేసిన తరువాత 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత తలను మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే జుట్టులో తేమను నిలుపుకుంటుంది.
మెంతులు: మెంతులు కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. రెండు మూడు చెంచాల మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి, మెంతులను పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. కొద్ది రోజుల్లోనే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
గుడ్డు: గుడ్డులో ఉండే ప్రొటీన్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది. గుడ్డులోని తెల్లసొన భాగాన్ని తీసి అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు మర్దన చేయాలి. ఇది మీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుతుంది. అలాగే మృదువుగా మారుతుంది.
Also read:
Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!