AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cough Remedies: జ్వరం తగ్గినా పొడి దగ్గు వేధిస్తోందా?.. ఈ టిప్స్‌తో వెంటనే తగ్గించుకోండి..

జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా దగ్గు తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఈ పొడి దగ్గు కొన్ని వారాల పాటు కొనసాగి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన సందర్బాల్లో ఆగకుండా వచ్చే దగ్గు ఇబ్బంది పెడుతుంటుంది. అసలు జ్వరం పోయిన తర్వాత ఈ దగ్గు ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లో పాటించాల్సిన నివారణోపాయాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

Cough Remedies: జ్వరం తగ్గినా పొడి దగ్గు వేధిస్తోందా?.. ఈ టిప్స్‌తో వెంటనే తగ్గించుకోండి..
Cough After Fever Remedies
Bhavani
|

Updated on: Aug 29, 2025 | 3:04 PM

Share

జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా దగ్గు తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఈ పొడి దగ్గు కొన్ని వారాల పాటు కొనసాగి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అసలు జ్వరం పోయిన తర్వాత ఈ దగ్గు ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లో పాటించాల్సిన నివారణోపాయాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.జ్వరం తగ్గినా కొంతమందిని పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తుంది. ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడే మార్పుల వల్ల ఈ దగ్గు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పొడి దగ్గు కొన్ని వారాలపాటు కొనసాగవచ్చు.

కారణాలు ఏమిటి?

జ్వరం తగ్గిన తర్వాత దగ్గు రావడానికి ప్రధాన కారణం పోస్ట్-వైరల్ దగ్గు. జ్వరానికి కారణమైన వైరస్లు శ్వాసనాళాల్లో వాపు కలిగిస్తాయి. జ్వరం తగ్గాక కూడా ఈ వాపు పూర్తిగా పోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారణంగా శ్వాసనాళాలు సున్నితంగా మారి, చిన్నపాటి ప్రేరణలకే దగ్గు వస్తుంది. గొంతు వెనుక భాగంలో స్రావాలు జారి, ఇరిటేషన్ కలిగించడం వల్ల కూడా దగ్గు వస్తుంది. దీన్నే పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు.

పరిష్కార మార్గాలు

పొడి దగ్గు తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

తేనె వినియోగం: గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే గొంతుకు ఉపశమనం లభిస్తుంది.

ఉప్పు నీటితో పుక్కిలించడం: గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతులోని వాపు తగ్గుతుంది.

ఆవిరి పట్టడం: వేడి నీటిలో ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడతాయి.

నీరు ఎక్కువగా తాగడం: శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇది గొంతు పొడిబారకుండా కాపాడుతుంది.

పొగాకుకు దూరం: పొగతాగడం వల్ల దగ్గు మరింత ఎక్కువవుతుంది. దీనికి దూరంగా ఉండాలి.

ఈ చిట్కాలు పాటించినా దగ్గు తగ్గకపోతే లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి.