New Variant of Dengue: జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్‌లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయా? భయపెడుతున్న డెంగ్యూ కొత్త వేరియంట్‌

ఈ రోజుల్లో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కరోనా తర్వాత కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. ఇక జ్వరం వచ్చిందంటే చాలు రక్త పరీక్షల్లో..

New Variant of Dengue: జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్‌లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయా? భయపెడుతున్న డెంగ్యూ కొత్త వేరియంట్‌
New Variant Of Dengue
Follow us

|

Updated on: Nov 05, 2022 | 1:12 PM

ఈ రోజుల్లో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కరోనా తర్వాత కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. ఇక జ్వరం వచ్చిందంటే చాలు రక్త పరీక్షల్లో ఏం తేలుతుందోనని భయాందోళనకు గురవుతుంటాయి. జ్వరం రావడానికి అనేక కారణాలుంటాయి. శరీరంలో ఏ చిన్నపాటి సమస్య తలెత్తినా జ్వరంతో పాటు ఇతర లక్షణాలు బయట పడుతుంటాయి. ఇక డెంగ్యూ విషయానికొస్తే ఇది చాలా ప్రమాదకరంగా సంభవిస్తుంటుంది. డెంగ్యూ వచ్చిందంటే చాలు జ్వరంతో పాటు ప్లేట్‌ లెట్స్‌ పడిపోతుంటాయి. ఇప్పుడు డెంగ్యూ నుంచి కొత్త వేరియంట్‌ వస్తోంది. ఈ వేరియంట్‌లో జ్వరం తగ్గినా? ప్లేట్‌లెట్స్‌ ఒక్కసారిగా తగ్గిపోతుంటాయి. ఈ డెంగ్యూ కొత్త రూపాయనికి భయపడాల్సి వస్తోంది. రోగి కోలుకున్న తర్వాత ప్లేట్‌లెట్ కౌంట్ మళ్లీ పడిపోతుంది. చాలా మంది డెంగ్యూ రోగుల్లో ఈ లక్షణం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ ఈ కొత్త రూపాన్ని ప్రస్తుతం D-2గా గుర్తించారు పరిశోధకులు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో డెంగ్యూ బారిన పడిన రోగులలు ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ కొత్త రకం డెంగ్యూలో రోగులకు మొదటి రెండు రోజులు జ్వరం వస్తుందని వైద్యులు తెలిపారు. మూడో రోజు నుంచి జ్వరం తగ్గుముఖం పడుతోంది. రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమవుతుంది. వేగవంతమైన శారీరక క్షీణత కారణంగా చాలా మంది చికిత్స లేకుండా మరణిస్తున్నారని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌బంధు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శంకర్ త్రిపాఠి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. సాధారణ డెంగ్యూ విషయంలో రోగి శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే అది ఆందోళన కలిగించే విషయమే. కానీ డెంగ్యూ ఈ కొత్త వేరియంట్ D2 లో ప్లేట్‌లెట్ కౌంట్ 40,000 కంటే తక్కువగా పడిపోతుంది ఇది చాలా ఆందోళనకరమైనది. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స ప్రారంభించాలి.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ ఈ కొత్త రూపాంతరం కరోనా సోకిన వారికి ప్రాణాంతకం కావచ్చు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతూనే ఉంటుంది. అనేక మంది రోగులకు మూర్ఛ పడిపోతున్నట్లు కూడా ఉన్నట్లు నివేదించబడింది. కొత్తగా కరోనా లేని వారికి డెంగ్యూ వస్తే అది కాలేయంపై ప్రభావం చూపుతుంది. హెపటైటిస్‌ బారిన పడే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం చికిత్స కోసం సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిని అనుసరిస్తున్నారు.

డెంగ్యూ సాధారణ లక్షణాలు:

చలితో హఠాత్తుగా జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, మోకాళ్ల నొప్పులు. బలహీనపడటం, ఆకలి లేకపోవడం, తల తిరగడం, గొంతు నొప్పి, శరీరం మీద దద్దుర్లు వంటివి లక్షణాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (D-2) లక్షణాలు:

ముక్కు, చిగుళ్ళ నుండి రక్తస్రావం, వాంతులతో రక్తస్రావం, చర్మంపై ముదురు, శరీరంపై నీలం లేదా నల్ల మచ్చలు,

డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఏమిటి – దాని లక్షణాలు

డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది ప్రమాదకరమైన పరిస్థితి. ఇది అధిక జ్వరం. ముక్కు, చిగుళ్ళ నుండి రక్తస్రావం కలిగి ఉంటుంది. ఇది శోషరస, రక్త కణాలను దెబ్బతీస్తుంది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌లో రోగి రక్తప్రసరణ వ్యవస్థ నాశనం కావడం ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభ దశలో నియంత్రించబడకపోతే అది షాక్ సిండ్రోమ్‌ అని గుర్తించాలి. భారీ రక్తస్రావం, మరణం వరకు దారితీస్తుంది. వేరే వైరస్ సెరోటైప్‌తో ద్వితీయ సంక్రమణ ఫలితంగా తీవ్రమైన డెంగ్యూ సంభవిస్తుంది. రోగి ఆకస్మిక అస్థిరత, జ్వరం ఉన్నప్పటికీ చర్మం చల్లగా ఉండటం, తరచుగా మూర్ఛపోవడం, కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, కొన్నిసార్లు చాలా వేగంగా హృదయ స్పందన ఉండటం లాంటివి లక్షణాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి