AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: నవ్వు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.. మరి ఏడుపు సంగతేంటి.? నిపుణుల మాటేంటి..

నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. నవ్వడం ఒత్తిడి తగ్గుతుంది, మనసు ఉల్లాసంగా మారుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సామెత ఉంది. అయితే నవ్వక పోవడం రోగమే కానీ.. ఏడ్వడం మాత్రం..

Health: నవ్వు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.. మరి ఏడుపు సంగతేంటి.? నిపుణుల మాటేంటి..
Crying Benefits
Narender Vaitla
|

Updated on: Nov 05, 2022 | 1:55 PM

Share

నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. నవ్వడం ఒత్తిడి తగ్గుతుంది, మనసు ఉల్లాసంగా మారుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సామెత ఉంది. అయితే నవ్వక పోవడం రోగమే కానీ.. ఏడ్వడం మాత్రం రోగం కాదని చెబుతున్నారు నిపుణులు. నిజం నవ్వడం ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఏడ్వడం వల్ల కూడా అలాంటి లాభాలే ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఏడ్వడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలంటే ఓ లుక్కేయండి..

* ఏడుపు మన శీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బాధ పడడం కంటే కన్నీరు వచ్చేలా ఏడ్వడం వల్లే ఎక్కువ ప్రయోజం ఉంటుందంటా. కన్నీరులో 98 శాతం నీరు, మిగిలనవి హార్మోన్లు, టాక్సిన్స్‌ ఉంటాయి. కన్నీటి ద్వారా శరీరం నుండి అనేక విష పదార్థాలు విడుదలవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

* ఏడ్వడం వల్ల మనసు తేలిక పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. బాధతో భారంగా మారిన మనసు ఏడిస్తే తేలికగా మారుతుందని మానసిక నిపుణుల అభిప్రాయం. చాలా మంది మనస్ఫూర్తిగా ఏడ్చిన తర్వాత కొత్త ఉత్సాహాన్ని పొందుతారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

* అప్పుడప్పుడు ఏడ్వడం వల్ల కళ్లు పొరిబారడం అనే సమస్యను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఐ లేదా డ్రై ఐ గ్లాండ్స్‌తో బాధపడేరికి ఏడుపు మంచి ఔధంగా చెబుతున్నారు.

* కొన్ని పరిశోధనల ప్రకారం బరువు తగ్గడంలో వ్యాయామం, డైట్‌తో పాటు ఏడుపు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందంటా. ఏడిచే సమయంలో శరీరంలో అధిక క్యాలరీలు ఖర్చు కావడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు.

* ఏడుపు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనసులో అనవసరగా బాధలు పెట్టుకొని కుంగిపోయే కంటే మనసారా ఏడ్చేసి తృప్తిగా ఉండాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన అంశాలు కొందరు నిపుణులు, అధ్యయనాల ఫలితాల ఆధారంగా తెలియజేసినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడమే సూచించదగ్గ అంశం.