AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nestle Cerelac: నెస్లే సెరెలాక్‌ పిల్లలకు ప్రమాదమా..? నిపుణుల షాకింగ్‌ విషయాలు

2015లో స్విస్ కంపెనీ నెస్లే మ్యాగీకి సంబంధించి వివాదంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. పిల్లల ఆహార ఉత్పత్తుల తయారీ విషయంలో నెస్లే అంతర్జాతీయ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. భారతదేశంలోని నెస్లే బేబీ-ఫుడ్ బ్రాండ్ సెరెలాక్ వంటి బేబీ ఉత్పత్తులకు ఎక్కువ చక్కెరను జోడిస్తుందని మరొక స్విస్ కంపెనీ పబ్లిక్ ఐ చేసిన పరిశోధన తెలిపింది....

Nestle Cerelac: నెస్లే సెరెలాక్‌ పిల్లలకు ప్రమాదమా..? నిపుణుల షాకింగ్‌ విషయాలు
Nestles Cerelac
Subhash Goud
|

Updated on: Apr 21, 2024 | 6:20 PM

Share

2015లో స్విస్ కంపెనీ నెస్లే మ్యాగీకి సంబంధించి వివాదంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. పిల్లల ఆహార ఉత్పత్తుల తయారీ విషయంలో నెస్లే అంతర్జాతీయ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. భారతదేశంలోని నెస్లే బేబీ-ఫుడ్ బ్రాండ్ సెరెలాక్ వంటి బేబీ ఉత్పత్తులకు ఎక్కువ చక్కెరను జోడిస్తుందని మరొక స్విస్ కంపెనీ పబ్లిక్ ఐ చేసిన పరిశోధన తెలిపింది. అనేక ఇతర దేశాల్లో ఈ ఉత్పత్తిని చక్కెర లేకుండా లేదా చాలా తక్కువ చక్కెర మోతాదుతో తయారు చేస్తారు. భారతదేశంలో అన్ని సెరెలాక్ బేబీ ఉత్పత్తుల్లో ఒక్కో సర్వింగ్‌కు 3 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది పిల్లలలో దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయాన్ని నివారించడానికి రూపొందించిన అంతర్జాతీయ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని పబ్లిక్ ఐ నివేదిక తర్వాత, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, FSSAI ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాయి.

ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో పిల్లలు చాలా ఉత్సాహంగా సెరెలాక్ తింటారు. పట్టణ ప్రాంతాలలో కూడా దీని డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా దీనిని తింటున్న పిల్లలు అనేక వ్యాధుల బారిన పడతారా? దీని గురించి నిపుణుల నుండి తెలుసుకుందాం.

సెరెలాక్ తినడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా?

నెస్లేకు చెందిన సెరెలాక్‌లో షుగర్ ఎక్కువగా ఉందా లేదా అనేది దర్యాప్తు చేయాల్సిన అంశమని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్‌ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదికపై విచారణ పూర్తి చేసినప్పుడే అంతా స్పష్టమవుతుంది.

ప్రశ్న ఏమిటంటే, చాలా చక్కెర పిల్లలకు ప్రమాదకరమా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే సమాధానం వస్తుంది. అదనపు చక్కెర పిల్లలలో అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్యలు స్థూలకాయం, మధుమేహాన్ని కలిగిస్తాయి.

చిన్న పిల్లలకు ప్రమాదకరమైనది

ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్‌హెచ్ ఘోటేకర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలకు (3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి) అధిక చక్కెర ప్రమాదకరమని చెప్పారు. అటువంటి పిల్లలలో చక్కెరను అధికంగా తీసుకోవడం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చిన్న పిల్లలకు ఎలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవ్వకుండా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. చిన్న పిల్లలకు తల్లి పాలు ఉత్తమం. దీని ద్వారా బిడ్డకు అన్ని రకాల పోషకాహారం అందుతుంది.

చక్కెర తీసుకోవడం ఎలా నియంత్రించాలి

తల్లిదండ్రులు పిల్లలకు ఏ రూపంలోనూ ఎక్కువ చక్కెర ఇవ్వకూడదని డాక్టర్ ఘోటేకర్ చెప్పారు. పిల్లలు తినే పదార్ధాలలో చక్కెర శాతాన్ని తనిఖీ చేయడం కూడా అవసరం. ప్యాక్ చేసిన ఆహారాన్ని తినకూడదని పిల్లలకు నేర్పించాలి. అలాగే జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగాన్ని పరిమితం చేయాలి. బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిదంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి