అలర్ట్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ సమస్య మొదలైనట్లే.. ఏం కాదులే అని లైట్ తీసుకున్నారో..

అసలే ఎండాకాలం.. నీరు పుష్కలంగా తాగడం మన శరీరానికి చాలా ముఖ్యం. నీరు మన శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల వ్యాధులు దూరం అవుతాయి.. ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నీరు కూడా చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు.

అలర్ట్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ సమస్య మొదలైనట్లే.. ఏం కాదులే అని లైట్ తీసుకున్నారో..
Water Deficiency
Follow us

|

Updated on: Apr 21, 2024 | 6:29 PM

అసలే ఎండాకాలం.. నీరు పుష్కలంగా తాగడం మన శరీరానికి చాలా ముఖ్యం. నీరు మన శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల వ్యాధులు దూరం అవుతాయి.. ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నీరు కూడా చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. కానీ శరీరంలో నీటి కొరత చాలా సమస్యలను కలిగిస్తుందన్న విషయం మీకు తెలుసా…? తెలియకపోతే.. శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఏం జరుగుతుంది..? నీటికొరత ఏర్పడటానికి ముందు సూచించే లక్షణాలు ఏమిటి..? అనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో నీటి కొరతను సూచించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

డీహైడ్రేషన్..

నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. తగినంత నీరు త్రాగకపోతే, నిర్జలీకరణం (డీహైడ్రేషన్) సంభవించవచ్చు. ముదురు రంగులో మూత్రం వస్తే… మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం చేసుకోండి.

మలబద్ధకం.. పొట్ట సమస్యలు..

మలబద్ధకం వంటి సమస్యల విషయంలో కూడా నీటి కొరత ఉందని గ్రహించాలి. దాహం అనిపించడం కూడా డీహైడ్రేషన్‌కు అత్యంత సాధారణ కారణం. శరీరంలో నీటికొరత వల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, నోరు, గొంతు పొడిబారడం, చర్మం పొడిబారడం, మొటిమలు మొదలైనవి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ నీటి కొరతకు సంబంధించిన లక్షణాలు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారవచ్చు..

నిర్జలీకరణానికి సకాలంలో చికిత్స చేయకపోతే, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీన్ని నివారించడానికి, రోజంతా కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. ఇది కాకుండా, అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను తినాలి. జ్యూస్, కొబ్బరినీళ్లను తీసుకోవాలి. మీరు ఇంట్లోనే షర్బత్ తయారు చేసుకోవచ్చు.. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ చర్యలు తీసుకున్న తర్వాత కూడా మీకు సమస్యలు ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక