Mustard Oil: కఫం, దగ్గు, గొంతు నొప్పులను దరిచేరనీయని ఆవనూనెతో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..
Benefits Of Mustard Oil:పోపుల పెట్టెలో ఉండే ఆవాలు ఓ ఔషధం.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఆవాల నుంచి తీసిన..
Benefits Of Mustard Oil:పోపుల పెట్టెలో ఉండే ఆవాలు ఓ ఔషధం.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఆవాల నుంచి తీసిన నూనెకు ఆవాల కంటే అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆవ నూనెను ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో ఆవనూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆవనూనెతో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఆవాల నూనె రెండు రకాలు.. వెజిటబుల్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్.. మొదటిది వంటల్లోకి రెండోది సౌందర్య సాధనల్లోకి ఉపయోగిస్తారు. అయితే వెజిటబుల్ ఆయిల్ కొంచెం ఘాటుగా ఉంటుంది. కనుక ఎక్కువమంది ఆవ నూనెతో చేసిన ఆహారపదార్ధాలను తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.ఆవనూనె ప్రతీ సీజన్లో మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఆవనూనె వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
*ఆవనూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ నూనెతో తయారుచేసిన ఆహారం తింటే మన గొంతు, శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది. మన శరీరంలోకి ఏ రకమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు చేరుకున్నా.. ఆవనూనెతో చేసిన వంటలు తింటే అవి చనిపోతాయి.
*ఇతర నూనెలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను తిన్నవారికంటే.. ఆవనూనెతో చేసిన వంటకాలు తిన్నవారు సీజనల్ వ్యాధుల నుంచి రక్షింపబడతారు. పోలిస్తే కఫం, జలుబు, ఛాతీనొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ.
*ఆవాల నూనె ధమనుల పనితీరుని సక్రమంగా ఉండేలా చూస్తుంది. అదే మిగిలిన వంట నూనెలు .. ముఖ్యంగా సింథటిక్, రిఫైండ్ నూనెలతో తయారైన ఆహారాన్ని తినడం వల్ల అవి నేరుగా శరీరంలోకి వెళ్లి సిరల్లో అదనపు కోవ్వు రూపంలో పేరుకుపోయి.. ధమని పనులను అడ్డుకుంటాయి. అదే ఆవనూనె తో తయారు చేసిన ఆహారపదార్ధాలు అయితే ఇటువంటిని సమస్యలు ఉత్పన్నం కావు.
*ఆవాల నూనెలో క్యాన్సర్ ను అరికట్టే గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాలద్వారా తెలుస్తోంది. అందుకనే ఈ నూనెని ఉపయోగించడం వలన ఉదరం, కొలోన్ క్యాన్సర్స్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఈ నూనెలో గ్లూకోసినోలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ ని అలాగే ట్యూమర్లని అరికడుతుంది.
*ఆవాల నూనె జాయింట్ పెయిన్ ని, కీళ్ల వాపులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన ర్యూమాటిజంను ఆర్తరైటిస్ ను అరికడుతుంది.
Also Read: కోరిన కోర్కెలను తీర్చే ఇందిర ఏకాదశి.. వ్రత నియమాలు.. విశిష్టత ఏమిటంటే..