Indira Ekadashi: కోరిన కోర్కెలను తీర్చే ఇందిర ఏకాదశి.. వ్రత నియమాలు.. విశిష్టత ఏమిటంటే..

Indira Ekadashi 2021: ఈరోజు ఇందిర ఏకాదశి.. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడుని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి..సకల కష్టాలు..

Indira Ekadashi: కోరిన కోర్కెలను తీర్చే ఇందిర ఏకాదశి.. వ్రత నియమాలు.. విశిష్టత ఏమిటంటే..
India Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2021 | 12:06 PM

Indira Ekadashi 2021: ఈరోజు ఇందిర ఏకాదశి.. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడుని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి..సకల కష్టాలు తొలిగిపోతాయని పురాణాల కథనం. ఈ ఇందిర ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. “ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి.

ఇందిర ఏకాదశి విశిష్టత గురించి.. వ్రత విధానం గురించి ఇంద్రుడికి నారదుడు చెప్పాడు. “ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుఝామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారు ఝామునే మేల్కొని స్నానం చేసి.. ఉపవాసం ఉండాలి.   ఓ పద్మనేత్రుడా! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను” అని పలికి భగవంతుని స్తుతించాలి. “తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీ కృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో, స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం కుటుంబ సభ్యులు , బంధు మిత్రులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారాయణం చేస్తూ భోజనం చేయాలి.  ఇలా  ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే పితృలు నిశ్చయంగా విష్ణులోకానికి వెళతారని చెప్పాడు

తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూధుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.

ఇందిరా ఏకాదశీ వ్రతము నియమాలు: ఉపవాసము ప్రారంభం ఈరోజు శనివారం మొదలుపెట్టాలి. ద్వాదశ పారాయణం: 3-10-2021 ఆదివారం ఉదయం 5.53 నుండి 9.52 మధ్యలో ఉపవాసం విడువవలెను. ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత విశేష ఫలితం ప్రసాదిస్తుంది.

Also Read:  మహానేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు.. ఆయన డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?